శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (14:17 IST)

బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' నగల తయారీ కోసం క్రిష్ చర్చలు

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించనున్న వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించనున్నారు. వై.రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. బిబో శ్రీనివాస్‌ సమర్పిస్తున్నారు. యావత్ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి అయిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' జీవితంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు.
 
బాలకృష్ణకు ద్విపాత్రాభినయం కొత్తేమి కాదు. ఆయన ఇప్పటివరకు చాలా సినిమాలలో ద్విపాత్రాభినయం పోషించారు. ఉగాది రోజు లాంచ్ అయిన ఈ చిత్రం ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే బాలయ్య కూడా తన వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో అన్నీ ఒరిజినల్ నగలనే ఉపయోగించనున్నాడట. ఇంతకుముందు 'రుద్రమదేవి' చిత్రం కోసం గుణశేఖర్ అన్నీ నిజమైన ఆభరణాలనే ఉపయోగించాడు. రుద్రమదేవి' సినిమాలో అనుష్క వాడే ఆభరణాల ఖరీదు 5 కోట్ల రూపాయలు. బాలీవుడ్ 'జోధా అక్బర్‌'కు పనిచేసిన నీతా లుల్లా ఈ సినిమాకు ఆభరణాలు డిజైన్ చేసింది. 
 
ఈమె డిజైన్ చేసిన నగలు నిజమైన వజ్రాలు, బంగారంతో తయారు చేసినవే. అలాంటివే అనుష్క ధరించింది. 'జోధా అక్బర్‌'లో ఐశ్వర్యారాయ్ పెట్టుకున్న నగలు ఎంత గుర్తింపు పొందాయో అంత గుర్తింపు ఈ నగలకు కూడా లభించింది. ఇప్పుడు అదేబాటలో బాలకృష్ణ పయణిస్తున్నాడు. ఓ ప్రముఖ జ్యూయలరీ సంస్థలతో వీటిని తయారు చేయించడానికి క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడట. ఇందుకోసం కార్పొరేట్ గోల్ట్ రిటైల్ మాల్స్‌తో చర్చలు నిర్వహిస్తున్నాడని తెలిసింది. దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్‌తో భారీ ఎత్తున బాలకృష్ణ కెరీర్ లోనే నిలిచిపోయే చిత్రంగా రూపొందిస్తున్నారు. సంక్రాంతి 2017న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.