గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: శుక్రవారం, 31 జులై 2015 (20:59 IST)

శేఖర్‌ కమ్ముల ఏమయిపోయాడు...?!! భల్లాలదేవను లీడర్ 2 చేసి చూపిస్తాడట...

క్లాసిక్‌ మూవీలు తీసే దర్శకుడిగా శేఖర్‌ కమ్ములకు మంచి పేరుంది. అలాంటి కమ్ముల.. లీడర్‌ తర్వాత ఆయనకు అంతగా పేరు రాలేదు. నయనతారతో 'అనామిక' అన్నాడు. ఆ తర్వాత అనామకంగా కనుమరుగయ్యాడు. సెలైంట్‌గా ప్రస్తుతం కొత్తవారితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంకా వాటి వివరాలు బయటకు రానివ్వలేదు. ఇదిలావుండగా, రానాతో లీడర్‌ తీసిన ఆయన మళ్ళీ బాహుబలి సినిమా చూశాక.. రానాతో కొత్త ఫార్మెట్‌లో లీడర్‌కు సీక్వెల్‌ తీయబోతున్నట్లు తెలుస్తోంది.
 
2010లో వచ్చిన ఈ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్‌ సిద్ధమవుతోంది. మహేష్‌ సినిమా చేస్తున్నారని ఆ మధ్య ఓ రూమర్‌ వచ్చింది. లీడర్‌ 2 కథా పనుల్లో తలమునకలై వున్నారన్నమాట. రానా ఓ మీడియా సమావేశంలో లీడర్‌ 2 స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. 
 
చాలా కాలంగా హిట్‌ లేని శేఖర్‌ ఖమ్ముల ఈ పొలిటికల్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాతో మరో హిట్‌ అందుకోడం ఖాయమే అనుకుంటే లీడర్‌ సినిమాని ఎ.వి.ఎం. సంస్థ నిర్మించింది. బాహుబలి తర్వాత.. మరో కొత్తకోణంలో కన్పించడం రానాకు ఎలాగూ అవసరమే కదా..