శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2015 (13:21 IST)

బికినీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది : బిపాసా బసు

సినిమానాల్లో నటించేటపుడే కాదు.. సాధారణ సమయాల్లో కూడా ధరించేందుకు బికినీలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని బాలీవుడ్ హాట్ గర్ల్ బిపాసా బసు అంటోంది. అయితే, ఇక్కడ మాట్లాడుకోవాల్సింది బికినీల గురించి కాదని, ఆ అమ్మాయి ధైర్యం, ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడుకోవాలని కోరింది. 
 
'ధూమ్-2', 'ప్లేయర్స్' వంటి సినిమాల్లో టూపీస్ బికినీల్లో ఈ ముద్దుగుమ్మ తళుక్కున మెరవడమేకాకుండా, బాలీవుడ్‌లో హాట్ హాట్ భామగా పేరుగడించింది. టాలీవుడ్‌లో 'టక్కరి దొంగ' అనే చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతి తక్కువ కాలంలోనే ఈ ముద్దుగుమ్మ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీనికి కారణం.. టూపీస్ దుస్తులే. 
 
దీనిపై ఈ భామ మనస్సులో ఉన్న మాటను తాజాగా వెల్లడించింది. బికినీ అంటే చాలా ఇష్టమని చెప్పింది. 'బికినీ వేసుకోవడం నా వరకైతే సహజంగానే అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇండస్ట్రీలో అమ్మాయిలు పిట్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. బికినీతో చూడటానికి కూడా బాగా కనిపిస్తారు. అయినా మనం మాట్లాడుకోవాల్సింది బికినీ గురించి కాదు. అమ్మాయికి ఎంత ఆత్మవిశ్వాసం ఉందనేది ముఖ్యం. అందుకే బికినీని పట్టించుకోవడం కంటే ఆత్మవిశ్వాసాన్ని లెక్కలోకి తీసుకుంటే బావుంటుందని అని సలహా ఇచ్చింది.