శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శనివారం, 18 అక్టోబరు 2014 (19:15 IST)

ఏంటీ నన్ను సంతోషపెట్టవా...? యాంకర్ తో బ్రహ్మానందం...

నటుడు బ్రహ్మానందం బయట ఫంక్షన్స్‌కు వస్తే చాలు ఏదోవిధంగా సెటైర్లు వేస్తుంటారు. ముఖ్యంగా అక్కడ యాంకర్లు లేడీసే వుంటారు. తన గురించి గొప్పగా పరిచయం చేస్తూ ఆహ్వానించకపోతే ఏదోవిధంగా సెటైర్లు వేస్తూంటారు. ఓ ఫంక్షన్‌లో బ్రహ్మానందంగారిని డైరెక్ట్‌గా ఆహ్వానించేసరికి.. నా గురించి కొత్తగా చెప్పేదేముంది... అందరి గురించి చెప్పి.. నా గురించి నేనే చెప్పుకోవాలి.
 
అందరినీ సంతృప్తిపర్చాలంటూ... మీటింగ్‌ అయ్యాక... ఆ యాంకర్‌ను నన్ను సంతోషపెట్టరా? అంటూ అడిగేశాడు. దాంతో స్టేజీపై వున్నవారు నవ్వేశారు. మీకు నేనెలా కనబడుతున్నాను.. అని ఆమె అంటే, వెంటనే... నన్ను సంతోష పెట్టడం అంటే... నవ్వించవా? అని అర్థం. సినిమా భాషను ఇంకా నేర్చుకోవాలంటూ హితవు కూడా పలికాడు. షూటింగ్‌లో తోటి నటీమణులతో వేసే సెటైర్లు ఇక్కడ కూడా వేస్తే ఎలా? అంటూ స్టేజీపై ఉన్న మరో కమేడియన్‌ వ్యాఖ్యానించేసరికి.. ఆహా! అంటూ గొణిగాడు. అదీ బ్రహ్మీ.. సెటైర్‌ అంటే..