Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

25 యేళ్ళ తరువాత రాములమ్మకి బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్...

శనివారం, 28 అక్టోబరు 2017 (19:21 IST)

Widgets Magazine
vijayashanti

ఒకప్పుడు చిరంజీవి, విజయశాంతి జంట అంటే మాస్‌కే కాదు క్లాస్‌కు కూడా పిచ్చ క్రేజ్. ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో కలిసి నటించారు. వీరి జంట నటించిన చివరి చిత్రం మెకానిక్ అల్లుడు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కూడా నటించారు. ఆ తరువాత వీరిద్దరి జంట ఎక్కడా కనిపించలేదు. 
 
ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయశాంతి హీరోయిన్‌కు ప్రాధాన్యమున్న సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది. అయితే పాతికేళ్ళ తరువాత చిరంజీవి, విజయశాంతిల జంట మరోసారి తెరపైన కనిపించనుంది. సైరా నరసింహారెడ్డి సినిమాలో విజయశాంతి కీలక రోల్ చేయనున్నారు. రాజకీయంగా వీరి మధ్య వైరమున్నా వ్యక్తిగతంగా మాత్రం చిరుకి విజయశాంతి అంటే ఎంతో ఇష్టం. అందుకే సైరా నరసింహారెడ్డిలో విజయశాంతికి అవకాశం కల్పించారు చిరు. 
 
సైరాలో విజయశాంతి కనిపిస్తే ఒక కొత్త ట్రెండ్ స్టార్టవుతుంది. చిరు స్వయంగా ఫోన్ చేసి దర్శకుడు సురేందర్ రెడ్డిని కలవమని విజయశాంతికి చెప్పారట. చిరు చెప్పిన తరువాత సురేందర్ రెడ్డి కాదంటాడా. డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే షూటింగ్‌కు నేరుగా వచ్చేయండని విజయశాంతికి చెప్పేశాడు దర్శకుడు. 2019 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తెలుగు టాప్ హీరోల వయసులెంతో తెలుసుకోవాలనుందా...?

తెలుగు సినీపరిశ్రమలో కొంతమంది పాతతరం హీరోలు యంగ్‌గా కనిపిస్తుంటారు. మేకప్‌తో వారి ...

news

సత్యాన్ని అపవిత్రం చేసిన పవన్ : వీడియో పోస్ట్ చేసిన వర్మ (Video)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు విమర్శలు ...

news

దర్శకులు హీరోయిన్లను బరువు పెరగమంటారు: హీనా ఖాన్

హిందీ 'బిగ్ బాస్ - 11' షోలో కంటెస్ట్ అయిన నటి హీనా ఖాన్ దక్షిణాది హీరోలు, హీరోయిన్లపై ...

news

ఈ స్టోరీ నాకంటే ఎన్టీఆర్‌కు బాగా సూటవుతుంది : పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసిన సినిమా స్టోరీ ఒకటి ఇపుడు హీరో జూనియర్ ...

Widgets Magazine