Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తీరుమారని విలనిజం..! మద్యం తాగి నానాయాగీ చేసిన ఫిష్ వెంకట్.. కేసు

బుధవారం, 12 జులై 2017 (13:09 IST)

Widgets Magazine
fish venkat

ఫిష్ వెంకట్. తెలుగు చిత్రాల్లో ప్రధాన విలన్ పక్కన ఉండే చిన్నపాటి విలన్. ఈయనగారు నిజ జీవితంలోనూ అలానే ప్రవర్తించాడు. మద్యం సేవించి నానాయాగీ చేశాడు. ఫలితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పలుమార్లు పోలీసులు హెచ్చరించినప్పటికీ ఆయన తీరుమాత్రం మారలేదు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
తెలంగాణకు చెందిన ఫిష్ వెంకట్‌కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన కుమార్తెను కొత్తగూడెంలోని ఏ పవర్‌హౌజ్‌ బస్తీకి చెందిన మెడికల్‌షాపు‌లో పనిచేసే ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించగా, ఆమె 4 యేళ్లుగా ఏ పవర్‌హౌజ్‌ బస్తీలో నివాసం ఉంటోంది. 
 
కాగా, ఈమె ఇంటికి పక్కనే ఉన్న వేముల రాజేశం, వేముల ఉపేంద్ర, వేముల ప్రసాద్‌ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇది చినికి చినికి గాలివానలా మారింది. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన వెంకట్‌తో పాటు 8 మంది కొత్తగూడెం వచ్చి, వేముల ప్రసాద్‌ ఇంటి ఎదుట అర్థరాత్రి వరకు నానా యాగీ చేశారు. ఈ విషయాన్ని ప్రసాద్‌ వన్‌టౌన్‌ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ తిరుపతి సర్ది చెప్పి పంపించేశారు. 
 
మళ్లీ ఈనెల 4వ తేదీన అతిగా మద్యం తాగి ఫిష్‌ వెంకట్... కాస్త దురుసుగా ప్రవర్తించాడు. బాధితులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా వారు మందలించి వదిలేశారు. అయినా తీరుమారని ఫిష్‌ వెంకట్‌, అతడి ఇద్దరు కుమారులతో పాటు మరి కొంతమందితో వచ్చి మళ్లీ వేముల ప్రసాద్‌, ఉపేంద్ర, రాజేశంపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో వారు ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఫిష్‌ వెంకట్‌పై కేసునమోదు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్వాసథెరపీ పేరుతో ప్రియాంకను నలిపేసిన బాయ్‌ఫ్రెండ్ (Video)

బాలీవుడ్ నటి ప్రియాంకను ఆమె బాయ్‌ఫ్రెండ్ వాటిని పట్టుకుని నొక్కేశాడు. నొక్కడం కూడా ...

news

జయ జానకీ నాయక సినిమా ట్రైలర్‌ వచ్చేసింది.. (వీడియో)

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జయ జానకీ నాయక సినిమా ఫస్ట్ లుక్ ...

news

#LIEMovieTeaser : 'అబద్దం తోడులేకుండా కురుక్షేత్ర యుద్ధం పూర్తికాలేదట'...

టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం "లై". లవ్ ఇంటెలిజెన్స్ అనేది ట్యాగ్‌లైన్. ...

news

ఇలియానాకు హార్మోన్ల సమస్య వస్తే... టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేసిందట..!

పదిహేనేళ్ల వయస్సులోనే దేవదాసు సినిమాలో నటించిన ఇలియానా అప్పట్లో హార్మోన్ల సమస్యతో ...

Widgets Magazine