అర‌వింద స‌మేత ఆడియో క్యాన్సిల్... ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కి చంద్రబాబు, బాలయ్య

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (14:04 IST)

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అర‌వింద‌స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ పైన అన్న‌పూర్ణ స్టూడియోలో ఓ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఎస్ఎస్. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆడియోను ఈ నెల 20న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న క్యాన్సిల్ అయ్యింది.
 
ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ వేడుక‌ను రాయ‌ల‌సీమ‌లో కానీ.. ఆంధ్ర‌లో కానీ చేయాల‌నుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ వేడుక‌కు అనుకోని అతిథులు బాల‌కృష్ణ‌, చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతార‌ని తెలిసింది. ఇప్పుడు ఇదే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్. అక్టోబ‌ర్ 1 నుంచి 10 లోపు ఈ వేడుక ఉంటుంద‌ట‌. అక్టోబ‌ర్ 11న ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్, బాల‌య్య‌, చంద్ర‌బాబు.. ఈ ముగ్గురు ఒకే వేదికపై ఉంటే నంద‌మూరి అభిమానుల‌కు నిజంగా పండ‌గే.

ఏం చేయను.. బ్రేకప్ జరిగిన విషయం నిజమే... రష్మిక మందన్న

గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన్నకు కన్నడ నిర్మాత, హీరో రక్షిత్ శెట్టితో జరిగిన ...

తండ్రి కోరిక నెరవేర్చడం కోసం రూ.కోట్లు ఖర్చు... కన్నడలో కూడా రిలీజ్

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఈ చిత్రం షూటింగ్ ...

ప్లీజ్.. రష్మిక‌ను విల‌న్‌లా చూడొద్దు: ర‌క్షిత్ శెట్టి

తెలుగు చిత్రపరిశ్రమ సెన్సేషన్ ర‌ష్మికా మంద‌న్న. ఈమె వ్య‌క్తిగ‌త జీవితం ఇప్పుడు సోష‌ల్ ...

బిగ్ బాస్... ప్లీజ్ ఎలిమినేట్ హర్/హిమ్... మీ ఓటు ఎవరికి?

‘బిగ్ బాస్ సీజన్ 2’ చివరి అధ్యాయం సమీపించనుంది. ఇప్పటికి 93 ఎపిసోడ్‌లు పూర్తి కాగా మరో 7 ...