బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : సోమవారం, 7 జులై 2014 (14:09 IST)

మెగాస్టార్ 150వ చిత్ర దర్శకుడి కోసం చరణ్ అన్వేషణ!

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ఓటమితో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదేసమయంలో రాష్ట్ర విభజన పుణ్యమాని భవిష్యత్‌లో ఆయన ఓ వెలుగు వెలిగే అవకాశం కూడా లేదు. దీంతో తన వ్యాపారమైన చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా తన 150వ సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. 
 
ఇప్పటికే చిరంజీవి ఈ సినిమా కోసం మూడు కథలను ఓకే చేసినట్టు సమాచారం. తన పుట్టినరోజున ఈ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారట. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తండ్రి 150వ సినిమాలో నటించాలని ఉవ్విళ్లూరుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఒకవేళ కథలో తన పాత్రకు ఛాన్స్ లేకపోయినా సినిమాలో ఏదో ఒక చోట తనను చేర్చేలా చూడాలని డైరెక్టర్‌ని కోరుతానని రామ్‌చరణ్ చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని చిరంజీవి భార్య సురేఖ తమ సొంత బ్యానర్ పైన ప్రొడ్యూస్ చేస్తారట. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమ సొంత బ్యానర్ పైన చేసే మంచి దర్శకుడి కోసం చిరు, చరణ్ అన్వేషిస్తున్నారట.