బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2015 (17:18 IST)

చిరంజీవి కొత్త చిత్రం ఇప్పటికింతేనా... డైరక్టర్ ఎంపికపై మెగాస్టార్ డైలామా!

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ప్రారంభోత్సవం ఇప్పటికింతేలా మారింది. వాస్తవానికి ఆయన నటించే 150వ చిత్రం ప్రారంభోత్సవం మెగాస్టార్ పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన ప్రారంభంకావాల్సి ఉంది. అయితే, అది జరిగేలా లేదు. ఎందుకంటే మరో ఈనెల 22వ తేదీన చిరంజీవి బర్త్‌డే. ఇప్పటివరకు ఎలాంటి హడావుడి లేదు. దీంతో ఆ రోజున కొత్త చిత్రం ప్రారంభోత్సవం లేనట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఈ పరిస్థితికి కారణం దర్శకుని ఎంపికే. ముందుగా పూరీ జగన్నాథ్ పేరు ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత వి.వి వినాయక్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు హల్‌చల్ చేసింది. దీంతో డైరెక్టర్ ఎవరనే విషయంలో డైలామా కొనసాగుతూనే ఉంది. అయినా సరే ఇంకా ఎవ్వరూ ఫైనల్ మాత్రం కాలేదు. అందుకే ఈ సినిమా ముహూర్తం లేటుకు ఓ కారణమని చొప్పొచ్చు.