శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 25 ఆగస్టు 2014 (16:30 IST)

చిరు బర్త్ డే సీక్రెట్స్... నేపాల్ స్పాలో ఆయుర్వేదిక్ మసాజ్.....?

మొన్ననే ఆగస్టు 22న చిరంజీవి పుట్టిరోజు సెలబ్రేషన్స్ ఫ్యాన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు. కానీ అన్నయ్య మాత్రం ఆరోజు నేపాల్ వెళ్లిపోయారు. అక్కడ పశుపతి దేవాలయంలో పూజలు చేయించుకునేందుకు వెళ్లారని అంతా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి. అవేంటయా అంటే... తన లుక్ కు మరింత మెరుగు పెట్టేందుకు చిరంజీవి నేపాల్ లో ఉన్న పాపులర్ స్పాకు వెళ్లారట. 
 
అక్కడ వయస్సు తక్కువగా ఉండేట్టు చూపే చికిత్సకు సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలు తీసుకున్నట్లు చెపుతున్నారు. అంతేకాకుండా హిమాలయా రిట్రీట్ స్పా అనే ఒక ప్రకృతి వైద్య చికిత్సాలయంలో ఆయుర్వేదిక్ మసాజ్ థెరపీ, హాట్‌స్టోన్ మసాజ్ థెరపీ, రీజువినేషన్ మసాజ్ థెరపీ, స్టీమ్‌బాత్ వంటి విషయాలకు సంబంధించిన విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నట్లు సమాచారం. ఎలాగైనా తన 150వ సినిమాలో యంగ్ లుక్ తో తన అభిమానులకు కనిపించాలని చిరంజీవి తెగ తంటాలు పడుతున్నారని చెపుతున్నారు.