గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : బుధవారం, 29 జూన్ 2016 (09:45 IST)

చంచల్‌గూడ జైలులో కత్తిలాంటోడు.. ఖైదీ నెంబర్ 150.. ఆ నెంబర్ ఎందుకొచ్చింది?

మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎట్టకేలకు ప్రారంభమైంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంట

మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎట్టకేలకు ప్రారంభమైంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ''కత్తి''కి రీమేక్‌ అయిన ఈ సినిమాలో చిరు రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఒక పాత్రలో భాగంగా ఈ సినిమాలో ఆయన 20 నిమిషాల పాటు ఓ ఖైదీగా కనిపించనున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను మంగళవారం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో చిత్రీకరించారు. ఖైదీ వేషధారణలో ఉన్న చిరంజీవి పాల్గొనగా సీన్స్ తీశారు. చిరు వేసుకున్న చొక్కాపై 150 అనే అంకెలు కనిపించడం విశేషం. బహుశా చిరు 150వ సినిమాను ప్రతిబింబించేలా 150 అని పెట్టుంటారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
గతంలో చిరంజీవి నటించిన ఖైదీ సినిమాను తలపించేలా.... ఇప్పుడు మరోసారి ఖైదీగా కనిపించనున్నాడు. కథానుసారం ప్రకారం ఈ సినిమాలో చిరు జైలు నుండి పారిపోతాడు. ఈ ముఖ్యమైన సీన్ కోసం ఖైదీ డ్రెస్‌ వేసుకున్నాడు మెగాస్టార్. మొత్తానికి సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్‌ ఇలా ఖైదీ గెటప్‌లో కనిపించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.