శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శనివారం, 17 జనవరి 2015 (14:17 IST)

నేనే కత్రినా కైఫ్ అయితే... దీపికా పదుకునె సమాధానం...

ఈమధ్య దీపికా పదుకునే లవ్‌లో పడిందనే మాట ఓకే కానీ ఎక్కడా బయట చెప్పకపోయినా.. ఆమె గురించి ఏదోరకంగా చర్చ జరుగుతూనే వుంది. ఇటీవలే ముంబైలో ఓ ప్రోగ్రామ్‌లో ఆమె హాజరైతే.. మీరే కత్రినా కైఫ్‌ అయితే కొత్త ఏడాదిలో ఏం నిర్ణయాలు తీసుకుంటారని అడిగితే.. వెంటనే.. నేను ఆమెనైతే.. రణబీర్‌ను పెండ్లి చేసుకుంటానని సెలవిచ్చింది. 
 
దీని వెనుక చాలా కథే వుందని అక్కడివారు నవ్వుకున్నారు. కాగా, గతంలో ఓసారి కత్రినా కైఫ్‌కు మీరిచ్చే సలహా ఏమిటి? అని అడిగితే.. రణబీర్‌ను పెండ్లి చేసుకోవద్దని చెబుతా అని చెప్పింది. ఇలా మాట్లాడటం వెనుక గతంలో తాను మాట్లాడిన దాన్ని తగ్గించుకునేట్లుగా కారణంగా చెబుతున్నారు.