మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 28 మే 2016 (13:41 IST)

నారదుడు పేరుతో తెలుగులో డబ్బింగ్ కానున్న ధనుష్ చిత్రం

ధనుష్‌, శ్రియ, జెనీలియా కాంబినేషన్‌లో సూరజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై జోహార్‌ దర్శకత్వంలో నిర్మితమై తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రం తెలుగులో 'నారదుడు' టైటిల్‌లో  తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రాన్ని రేష్మి, కంష్మ్‌ సమర్పణలో ఉమ (సైదాపురం) తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
డబ్బింగ్‌ కార్యక్రమాలు దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిత్రం గురించి నిర్మాత ఉమ మాట్లాడుతూ..... తమిళనాట ధనుష్‌ నటించిన చిత్రాల్లో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. శశాంక్‌ వెన్నెలకంటి అందించిన సంభాషణలు, విజయ్ ఆంటోని సంగీతం, భువనచంద్ర పాటలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాత తెలిపారు. 
 
ధనుష్‌, శ్రియా, జెనీలియా కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ధనుష్‌ నటన మరో హైలైట్‌గా నిలిచే ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేస్తున్నాం' అని నిర్మాత తెలిపారు.