గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (16:49 IST)

ధనుష్ 'కోడి'... సంతోష్ నారాయణన్ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం...

తమిళ స్టార్ హీరో ధనుష్ చేతినిండా సినిమాల‌తో య‌మా బిజీ అయిపోయాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం 'కోడి'. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్‌కి జంటగా త్రి

తమిళ స్టార్ హీరో ధనుష్ చేతినిండా సినిమాల‌తో య‌మా బిజీ అయిపోయాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం 'కోడి'. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్‌కి జంటగా త్రిష, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'ధర్మయోగి'(ది లీడర్) పేరుతో విడుదల చేయనున్నారు. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను అక్టోబర్‌ రెండో వారంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.