Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జాత్యహంకారమా..? వినోదమా..? ప్రియాంకాచోప్రాకు తప్పని లైంగిక వేధింపులు

శుక్రవారం, 19 మే 2017 (11:07 IST)

Widgets Magazine
priyanka chopra

హాలీవుడ్‌లో తను నటిస్తున్న చిత్రాల్లో సత్తాచాటుకుంటూ నటనలో కానీ, అందాల ప్రదర్శనలో కానీ వెనక్కు తగ్గకుండా దూసుకెళ్తున్న ప్రియాంకాచోప్రా ఇటీవల ఓ ఇబ్బందికరమైన, అసహ్యకరమైన సందర్భంలో చిక్కుకుంది. బేవాచ్ గర్ల్‌గా ఇటీవల మరింత పాపులారిటీని సంపాదించుకున్న ప్రియాంకా చోప్రాను అక్కడి పరిశ్రమ వర్గాలే కాకుండా, బుల్లితెర వ్యాఖ్యాతలు సైతం చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలకు నిదర్శనంగా మరో ఉదంతం చోటు చేసుకుంది. హాలీవుడ్‌కు వెళ్లినప్పటి నుండి ఎన్నో సినిమాల్లో అధరచుంబనాలకు, పడకగది సన్నివేశాలకు, గాఢమైన శృంగార సన్నివేశాలకు ఏనాడు సిగ్గుపడని ఈ భామను ఓ వ్యాఖ్యత ఒకే ప్రశ్నతో డిఫెన్స్‌లోకి నెట్టేసాడు.
 
"వాచ్ వాట్ హ్యాపెన్స్ లైవ్ విత్ ఆండీ కోహెన్" అనే టీవీ షోలో ప్రియాంకను ఆ షో హోస్ట్ కోహెన్ ఓ చెత్త ప్రశ్న వేసాడు. బేవాచ్ నటులు డ్వేన్ జాన్సన్, జాక్ ఎఫ్రాన్‌లలో ఎవరి పురుషాంగం పెద్దదో సమాధానం చెప్పాలన్నాడు. ఖంగుతిన్న ప్రియాంక కాసేపటికే తేరుకుని, తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో "ఇది ప్రశ్నల్లో భాగం కాదు" అంటూ తప్పించుకుంది.
 
అనేక టీవీ షోలలో సందర్భోచితంగా సమాధానాలివ్వడమే కాక, తన అద్భుతమైన అమెరికన్ యాసతో వీక్షకులను ఆకట్టుకున్న ప్రియాంకా చోప్రాకు హాలీవుడ్ జనాల్లో మంచి క్రేజ్ ఉంది. కానీ ఇలా సహనటుల పురుషాంగాల్లో ఎవరి సైజు పెద్దది వంటి జుగుప్సాకరమైన ప్రశ్న కేవలం ఆమె భారతీయురాలు కావడం వల్లనే ఎదుర్కొవలసి వచ్చిందని, ఇది కేవలం జాత్యహంకారమేనని అంటున్నారు సినీ పండితులు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Racism Hollywood Baywatch Priyanka Chopra

Loading comments ...

తెలుగు సినిమా

news

నాన్నకు అక్కడకు వెళ్లే టైమ్ వచ్చింది.. వెళ్లారు.. పితృవియోగంపై హీరో సుశాంత్

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో సుశాంత్‌ తన తండ్రి మరణంపై స్పందించారు. ...

news

బాహుబలిని తలపిస్తున్న శ్రుతిహాసన్‌ ‘సంగమిత్ర’ ఫస్ట్‌లుక్‌

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. రూపొందిస్తున్న సంగమిత్ర సినిమా ఫస్ట్‌లుక్ నిజం చెప్పాలంటే ...

news

‘సాహోరే బాహుబలి’ పూర్తి వీడియో యూట్యూబ్‌లో విడుదల. మతిపోగుడుతోన్న విజువల్ వండర్

అద్భుతం, మహాద్భుతం, కమనీయం వంటి భాషలోని పదాలన్నీ వర్ణించినా బాహుబలి2 లోని ఆ పాట ...

news

అవకాశాలివ్వకపోతే భాషతో కొడతాను అంటున్న రాశీఖన్నా.. కోలీవుడ్‌లో వేషం దొరికిందట

ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలస వస్తున్న భామలు ఇక్కడ అవకాశాలు రావాలంటే ముందుగా ప్రాంతీయ ...

Widgets Magazine