గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (13:55 IST)

ఆ రోజు నా జీవితంలో వరస్ట్ డే... 27 గంటలు నరకంలో ఉన్నా...: దిల్ రాజు

తెలుగు చిత్ర పరిశ్రమలో పంపిణీదారుడు నుంచి బడా ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి 'దిల్' రాజు. ఈయన తీసిన తొలి చిత్రం 'దిల్'. ఆ చిత్రం తర్వాత తన పేరును 'దిల్' రాజుగా మార్చుకున్నారు. ఆయన తీసిన తాజా చిత్

తెలుగు చిత్ర పరిశ్రమలో పంపిణీదారుడు నుంచి బడా ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి 'దిల్' రాజు. ఈయన తీసిన తొలి చిత్రం 'దిల్'. ఆ చిత్రం తర్వాత తన పేరును 'దిల్' రాజుగా మార్చుకున్నారు. ఆయన తీసిన తాజా చిత్రం 'శతమానంభవతి'. ఈ సినిమాకుగానూ జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఇంత ఆనందకర సమయంలో భార్యలేని లోటు ఆయనను కుంగదీస్తోంది. 
 
ఈనేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో తన భార్య అనిత గురించి మాట్లాడుతూ... నేను అమెరికాలో ఉండగా, అనిత చనిపోయిందనే కబురు వచ్చింది. తెల్లవారుజామున 5:30 గంటలకు మా అల్లుడు అర్చిత్‌ ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. నాకు కొద్దిసేపు మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. నాకు కాలు చెయ్యి ఆడలేదు. 
 
నా బాధ అంతా మా పాప గురించే. కొద్ది సేపటికి డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఫోన్‌ చేశాడు. పాపను చూడలేకపోతున్నామని, వీలైనంత తొందరగా రమ్మని చెప్పాడు. అక్కడి నుంచి ఇక్కడుకు రావడానికి నాకు 27 గంటలు పట్టింది. నా జీవితంలో అదే వరస్ట్‌ డే. ఆ 27 గంటలూ నాకు నరకంలో ఉన్నట్టు అనిపించింది. 
 
విమానం ఎక్కగానే గత జ్ఞాపకాలన్నీ కదలాడాయి. కన్ను మూత పడలేదు. అమెరికా వెళ్లే రోజు ఉదయం అనిత నా కోసం పావ్‌ బాజీ చేసింది. అదే నేను ఆమె చేతుల మీదుగా తిన్న ఆఖరి ఫుడ్‌. డైనింగ్‌ టేబుల్‌ వద్ద ఆమె కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంటే ఏదో వెలితిగా ఉంటోంది’ అని చెప్పాడు దిల్‌ రాజు.