Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రచ్చహ... రచ్చస్య... రచ్చోభ్యహ.. డీజే, పూజా లవ్ ట్రాక్ రచ్చ రచ్చేనట..

హైదరాబాద్, శనివారం, 17 జూన్ 2017 (02:42 IST)

Widgets Magazine

ఫ్యాషన్ డిజైనర్ పూజా హెగ్డేతో దువ్వాడ జగన్నాధం మధ్య ప్రేమాయణం మూడు ముక్కల్లో చెప్పాలంటే రచ్చహ... రచ్చస్య... రచ్చోభ్యహ అనే రేంజిలో ఉంటుందని టాక్ ఆఫ్ ది టౌన్.. ఈ క్రమంలో ‘వెన్నెల’ కిశోర్‌ చేసే హంగామా, అల్లు అర్జున్‌ చేసే హడావిడి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయట. విషయం ఏమిటంటే దువ్వాడ జగన్నాథమ్‌ అలియాస్‌ అల్లు అర్జున్‌ది విజయవాడ లోని సత్యనారాయణపురం అగ్రహారం! ప్యూర్‌ వెజ్‌ అన్నపూర్ణ క్యాటరింగ్సు నడుపుతుంటాడు. అతను ఫ్యాషన్‌ డిజైనర్‌ అలియాస్‌ పూజా హెగ్డేను చూసి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ పెళ్లి పీటలు దాకా వచ్చే వరకు వీళ్లిద్దరి మధ్య ట్రాక్‌ రచ్చ రచ్చేనట.
pooja hegde

 
అల్లు అర్జున్ తాజా చిత్రం డీజే అలియాస్ దువ్వాడ జగన్నాథం సినిమాలో అస్మైక యోగ పాట తీవ్రంగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచిన ‘అస్మైక యోగ..’ పాట... పెళ్లి కుదిరిన తర్వాత తన ప్రేయసి, కాబోయే భార్యను జగన్నాథమ్‌ ఊహించు కుంటున్నప్పుడు వస్తుంది. శివుడిని స్తుతించే చమకాలను ప్రేమ గీతంలో వాడటం పరమ అభ్యంతర మంటూ బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలపడమే కాకుండా పాటలోని ఆ పదాలను తీసేయకపోతే థియేటర్లలో ఆడనివ్వం అంటూ హెచ్చరించడం తెలిసిందే. 
 
నిన్నటితో ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్‌ వర్క్స్‌ పూరయ్యాయి. చివరగా వివాదాస్పదమైన ఆ పాటలో మార్పులు చేశారని కూడా తెలుస్తోంది. సవరణ చేసిన వెంటనే సెన్సార్‌ కంప్లీట్‌ చేశారు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"నేనింతే" అంటోన్న ఆంధ్ర అమితాబ్

టాలీవుడ్‌లో "మాస్ మహారాజ్‌"గా పేరు తెచ్చుకున్న "రవితేజ" సినీ హీరోగా 20 సంవత్సరాలు ...

news

12-12-2017: రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారు..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజz అరంగేట్రానికి ముహూర్తం ఖరారైపోయిందా? అంటే ...

news

చైతూ.. ప్లీజ్, నన్ను వెళ్లనివ్వొద్దు.. నా విమానం టేకాఫ్‌ అవుతుందా? అంటున్న సమంత

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కోసం నెల రోజుల పాటు ...

news

తమిళ సినీపరిశ్రమ ఇక నాదే - మహేష్‌

మహేష్‌ బాబేంటి.. తమిళ సినీపరిశ్రమలో నెంబర్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పటికే విజయ్, సూర్య ...

Widgets Magazine