మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By mohan
Last Modified: సోమవారం, 26 జూన్ 2017 (19:03 IST)

తీసిన సినిమాలు ఎన్నిసార్లు తీస్తావు "హరీష్ శంకరా"???

హరీష్ శంకర్ ఎంత ఎనర్జీ ఉన్న డైరెక్టరో అందరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలలో అంత కొత్తదనం కనబడటంలేదు. పైగా వండిన వంటకాన్ని మళ్లీమళ్లీ వండి వడ్డిచ్చేస్తున్నాడు. 2006లో "షాక్" సినిమాతో దర్శకునిగా పరిచయమై, మొదటి సినిమాకే కోలుకోలేని షాక్ తిన

హరీష్ శంకర్ ఎంత ఎనర్జీ ఉన్న డైరెక్టరో అందరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలలో అంత కొత్తదనం కనబడటంలేదు. పైగా వండిన వంటకాన్ని మళ్లీమళ్లీ వండి వడ్డిచ్చేస్తున్నాడు. 2006లో "షాక్" సినిమాతో దర్శకునిగా పరిచయమై, మొదటి సినిమాకే కోలుకోలేని షాక్ తిన్నాడు. కానీ 2011 సంక్రాంతికి మరోమారు రవితేజతో "మిరపకాయ్" సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. ఈ సినిమా స్టోరీ కాస్త "పోకిరి", "ఖతర్నాక్" సినిమాలను కలిపి తీసినట్లుంటుంది. 
 
ఇది చూసి పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" సినిమాకు ఛాన్సిచ్చాడు. హిందీ నుండి రీమేక్ అయిన కథకు కొంచెం పవన్ మేనరిజాన్ని, డైలాగులను జోడించి పవన్ కళ్యాణ్‌కు 12 సంవత్సరాల తర్వాత బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. కానీ ఇది తన సొంత స్టోరీ కాదు. తర్వాత దిల్ రాజు నిర్మించిన "రామయ్యా వస్తావయ్యా"తో డిజాస్టర్ తీసి డిస్టిబ్యూటర్‌లను నట్టేట ముంచాడు. ఈ సినిమా 2012లో రాఘవ లారెన్స్ తీసిన "రెబెల్" సినిమాకు కాపీ తీసినట్టు ఉంటుంది. 
 
2015లో వచ్చిన "సుబ్రమణ్యం ఫర్ సేల్" సినిమా ఫర్వాలేదనిపించినా, చిరంజీవి "బావగారూ బాగున్నారా" సినిమాను రీమేక్ చేసినట్లుంటుంది. ఇప్పుడు "దువ్వాడ జగన్నాథమ్" అంటూ అల్లు అర్జున్‌తో తీసిన సినిమా మొదటి రోజు బాగా వసూళ్లను రాబట్టినా, రెండవ రోజు ఢీలా పడిపోయింది. అందుకు కారణం "స్టోరీ". ఎందుకంటే ముందుగా ఇలాంటి కథలతో అనేక చిత్రాలు వచ్చాయి. అది కూడా వరుస హిట్లతో ఉన్న అల్లు అర్జున్ అంటే ఫ్యాన్స్ ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు. అలాంటి ఆశలను ఈ చిత్రం కొంచెం దెబ్బతీసిందనే చెప్పాలి. 
 
ఈ చిత్రంతో నిర్మాత దిల్ రాజుకు కొంత నిరాశ తప్పేట్టు లేదు. అందుకే దర్శకులు కొత్త కథలతో సినిమాలు తీస్తే ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందు వరసలో ఉంటారని చెప్పడానికి "పెళ్ళి చూపులు" "కంచె" వంటి చిన్న చిత్రాలే నిదర్శనం. కాబట్టి "హరీష్ శంకర్" ఇకనైనా కొత్తగా సొంత కథలతో సినిమాలు తీసి, తన ఎనర్జీని చూపించే ప్రయత్నం చేస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.