శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2016 (17:05 IST)

రామ్ చరణ్ డాన్స్ చూసేందుకు డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు.. నిజమా?

డోనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్న అభ్యర్ధిగా కన్నా నోరు పారేసుకోడంలో ఆయనకున్న ఇమేజ్ ఇంకెవరికి ఉండదేమో.. ఈజీగా పబ్లిసిటీని ఎలా కొట్టేయొచ్చో ఈయనగారికి తెలిసినంతగా వేరెవరికి తెలి

డోనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్న అభ్యర్ధిగా కన్నా నోరు పారేసుకోడంలో ఆయనకున్న ఇమేజ్ ఇంకెవరికి ఉండదేమో.. ఈజీగా పబ్లిసిటీని ఎలా కొట్టేయొచ్చో ఈయనగారికి తెలిసినంతగా వేరెవరికి తెలియదు. నోరు విప్పితే చాలు ఏదో ఒక వివాదం రేగినట్టే. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం విషయంలో పోటీదారులందరిలో ఇతనే సెంటర్‌ ఆఫ్ ఎట్రాక్షన్. అభ్యర్థిత్వ ఖరారుకు ముందే వివాదాలకు కేంద్రబిందువైన ట్రంప్‌ తన కామెంట్లతో కొత్త భయాలు సృష్టిస్తున్నాడు. ట్రంప్ మాటలు వివాదాస్పదంగానే ఉన్నా అమెరికన్లకు అవి కొత్తగానే ఉంటున్నాయి. 
 
ఇదిలా ఉంటే ట్రంప్ రామ్ చరణ్ ఫర్మామెన్స్ చూడటం కోసం వస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ నెల 15న అమెరికాలోని న్యూజెర్సీలో పీఎన్సీ ఆర్ట్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనున్న హ్యుమానిటీ ఎగైనెస్ట్ టెర్రర్ అనే ఈవెంట్‌లో డాన్స్ చేయబోతున్నాడు. కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ''రిపబ్లికన్ హిందూ కొయిలిషన్'' (ఆర్.హెచ్.సీ) అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. దీంతో వచ్చే మొత్తాన్నిటెర్రరిస్ట్ బారిన పడి నష్టపోయిన కుటుంబాల్ని ఆదుకోవడం కోసం ఉపయోగిస్తారు. 
 
అందుకే మెగా హీరో చెర్రీ కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండా.. ఇందులో డాన్స్‌ చేయాడానికి రెడీ అయిపోయాడు. కాబట్టి ఆ కార్యక్రమానికి ట్రంప్ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నాడట. ఈ కార్యక్రమంలో చెర్రీతో పాటు సిసింద్రీ అఖిల్ కూడా డాన్స్ చేయబోతున్నాడు. అయితే ప్రస్తుతం ప్రచార పర్వంలో తెగ బిజీగా ఉన్న ట్రంప్… ఈ కార్యక్రమానికి వస్తాడా రాడా అనేది సస్పెన్స్‌గా మారింది.