శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2016 (17:07 IST)

అమలా పాల్ బాటలో 'ఇల్లాలు ప్రియురాలు' చిత్ర హీరోయిన్ దివ్య ఉన్ని?

మలయాళ బ్యూటీ అమలాపాల్ త్వరలోనే విడాకులు పొందనుంది. ఇందుకోసం అమలాపాల్, ఆమె భర్త విజయన్‌లు ఇప్పటికే చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇపుడు ఇదే బాటలో 'ఇల్లాలు ప్రియురాలు' చిత్ర హీరోయిన్‌ దివ్య ఉన్ని

మలయాళ బ్యూటీ అమలాపాల్ త్వరలోనే విడాకులు పొందనుంది. ఇందుకోసం అమలాపాల్, ఆమె భర్త విజయన్‌లు ఇప్పటికే చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇపుడు ఇదే బాటలో 'ఇల్లాలు ప్రియురాలు' చిత్ర హీరోయిన్‌ దివ్య ఉన్ని చేరనుంది. తన ఏడో యేట నుంచే బాలనటిగా అలరించిన దివ్య ఉన్న 21వ యేట సుధీర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని స్థిరపడింది. 
 
ప్రస్తుతం ఆమె ఓ డ్యాన్స్ స్కూల్‌ను నిర్వహిస్తోంది. అయితే, ఈ స్కూల్ నడపడం వల్ల నష్టాలు ఎక్కువగా వస్తుండటంతో దీన్ని మూసి వేయాలని ఆమె భర్త ఒత్తిడి చేయగా, ఆమె నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు పెరిగి విడాకులకు దాఖలు చేసుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 
 
అయితే, దివ్య విడాకులు కోరడానికి మరో కారణం ఉందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి సుధీర్‌కు అక్రమ సంబంధం ఉందని, దీంతో భార్యా భర్తల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని, అవి పెరిగి విడాకులకు దారితీశాయని, ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.