శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 26 మే 2015 (18:29 IST)

పవన్ గెడ్డం సీక్రెట్ తెలిసింది... గబ్బర్ సింగ్ 2లో గెడ్డంతో దడిపించడానికేనట...

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గత కొన్నిరోజులుగా బాగా గెడ్డం పెంచుతూ ఉన్నారు. ఆ గడ్డం బాహుబలి చిత్రంలో నటిస్తున్న రానా, ప్రభాస్ గెడ్డాలను మించిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గెడ్డం ఎందుకు పెంచుతున్నాడో అని చర్చలు కూడా నడిచాయి. చివరికి ఆ గెడ్డం రహస్యం బయటపడింది. గబ్బర్ సింగ్ 2 చిత్రం కోసమే గెడ్డం పెంచుతున్నాడట. ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలు గెడ్డంతో ముడిపడి ఉన్నాయట. అందుకే గెడ్డాన్ని బాగా పెంచాల్సి వచ్చిందట. 
 
గెడ్డంతోపాటు జుట్టు కూడా పొడవుగా ఉండాలట. పవన్ కళ్యాణ్ అటు గెడ్డాన్ని ఇటు జుట్టును బాగానే పెంచేశాడు. ఇకపోతే ఈ చిత్రంలో గెడ్డం సీన్లు అయిపోయాక క్లీన్ షేవ్ తో కనడబడతాడట. కాగా ఏఆర్ మురుగుదాస్ చిత్రం కోసం పవన్ కల్యాణ్ గెడ్డం పెంచారనే గుసగుసలు వినబడుతున్నాయి. ఐతే గబ్బర్ సింగ్ 2 చిత్రం పూర్తయ్యేవరకూ మరే చిత్రంలో నటించేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించలేదని అంటున్నారు. చూడాలి పవన్ గెడ్డాన్ని ఎలా ఉపయోగిస్తాడో...?!!