శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (12:03 IST)

ఆ డేటే బాగుందా.. అయితే ఖరారు చేయండి : పవన్ కళ్యాణ్!

విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'గోపాల.. గోపాల'. ఈ చిత్రం విడుదల తేదీపై ఉన్న అనుమానాలు, సందేహాలు తొలగిపోయాయి. ముందుగా అనున్నట్టుగా జనవరి 15వ తేదీనే విడుదల చేసేందుకు హీరో పవన్ కళ్యాణ్ సమ్మతించారు. 
 
వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తున్న ఈ చిత్రానికి హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌' చిత్రానికిది రీమేక్‌. పవన్‌ కల్యాణ్‌ మోడరన్‌ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 
 
ఈ చిత్రం ప్రోగ్రెస్‌పై నిర్మాత డాలీ మాట్లాడుతూ... 'భూకంపం కారణంగా తనకు జరిగిన అన్యాయానికి ప్రకృతే కారణమని నష్టపరిహారం ఇవ్వడానికి బీమా సంస్థ నిరాకరిస్తుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం రూపొందుతోంది. పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలయికలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్వామీజీగా మిథున్‌ చక్రవర్తి నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది' అని వివరించాడు.