శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 30 జులై 2014 (12:14 IST)

కన్నడ 'అత్తారింటికి దారేది'లో రూ.60 లక్షలకు హరిప్రియ న్యూడ్

తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది ఎంతటి సక్సెస్ కొట్టిందో వేరే చెప్పక్కర్లేదు. ఇపుడా చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఈగ విలన్ సుదీప్ హీరోగా చేస్తున్నాడు. తెలుగులో సమంత, ప్రణీత క్యారెక్టర్లలో వారినే నటింపజేయాలని చూస్తే ఇద్దరూ ఆకాశం వైపు చూశారట. దీంతో ఎందుకొచ్చిన గొడవని వేరేవాళ్లకి ఓకే చెప్పేశాడట. 
 
సమంత పాత్రలో రచితా రామ్ నటిస్తుండగా, ప్రణీత పాత్రలో హరిప్రియను బుక్ చేశాడట. విషయం ఏమంటే హరిప్రియ ఈ చిత్రంలో సుమారు అర నిమిషం పాటు సెమీ న్యూడ్ గా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తుంది. 
 
ఇందుకు గాను హరిప్రియ తన రెమ్యునరేషన్ ను ఎకాఎకిన 40 లక్షల నుంచి 60 లక్షలకు పెంచేసిందట. సుదీప్ కూడా మారుమాట్లాడకుండా ఆమెను అంతా ఇచ్చేసి ఫిక్స్ చేసుకున్నాడట. మరి కన్నడ అత్తారింటికి దారేదిలో హరిప్రియ అందాలు ఏమేరకు ఆరబోసిందో చూడాల్సిందే.