Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డ్రగ్స్ దందా : ఇన్‌స్టాగ్రామ్‌లో వేదాంతం వల్లించిన ఛార్మీ.. అందరి నోట అదే మాట..

శుక్రవారం, 14 జులై 2017 (14:46 IST)

Widgets Magazine
charmee

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్ ఛార్మీ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లోని తన ఖాతాలో ఛార్మీ ఓ పోస్టును పెట్టింది. తన చుట్టూ వుండేవారు హేళన చేస్తూ చిన్న బుచ్చినా బాధపడకు. వారలా చేస్తున్నారంటే.. కేవలం నీ ధైర్యాన్ని దెబ్బతీయడానికి మాత్రమే.. వారికన్నా గొప్పగా నువ్వు ఆలోచిస్తున్నావన్న భావన ఉంటేనే ఇలా అవమానిస్తుంటారని ఛార్మీ పోస్ట్ చేసింది. ఈ పోస్టును చూసిన వారంతా డ్రగ్స్ కేసులో తాను నిర్దోషినని ఛార్మీ చెప్పకనే చెప్పిందని నెటిజన్లు అంటున్నారు.
 
టాలీవుడ్‌ను డ్రగ్స్ మాఫియా కుదిపేస్తోంది. తెలుగు సినీ ప్రముఖుల్లో ఎందరో ఈ దందాలో చిక్కుకున్నారు. కొందరు పోలీసుల నుంచి విచారణకు రావాలని నోటీసులు అందుకున్నారు. ఇప్పటికే టీవీల్లో నోటీసులు పుచ్చుకున్న కొందరి పేర్లు లీక్ అయ్యాయి. మీడియా ముందుకు వచ్చిన వారంతా, డ్రగ్స్ వాడకంతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని, తప్పుగా తమను ఇరికించారని చెప్తున్నారు. విచారణకు కూడా సహకరిస్తామన్నారు. 
 
హీరో నవదీప్, తనీష్, గాయని గీతా మాధురి భర్త నందు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజు తదితరులు ఇదే మాట అన్నారు. వీరిలో చిన్నా మాత్రం తనకు ఇప్పటివరకూ నోటీసులే అందలేదని, తనకు సిగరెట్ అలవాటు కూడా లేదంటున్నారు. మిగిలిన వారు మాత్రం నోటీసులు వచ్చినట్టు స్పష్టం చేశారు. 
 
నవదీప్ మినహా మిగతా వారంతా తమకు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లూ లేవని, అరెస్టయిన కెల్విన్ తదితరులు పరిచయం కూడా లేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఛార్మీ వేదాంతం వల్లిస్తూ తనకు డ్రగ్స్‌కు సంబంధం లేనట్లు వ్యాఖ్యానించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Raviteja Navdeep Charmee Drugs Case Tollywood Celebs Mumaith Khan Drug Racket Case

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆహారం-శృంగారం రెండింటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేయడం కష్టం.. సమంత చిట్ చాట్ (వీడియో)

టాలీవుడ్ టాప్ హీరోయిన్.. అందాల నటి.. అక్కినేని వారి కాబోయే కోడలు సమంత జేఎఫ్‌‍డబ్ల్యూ ...

news

డ్రగ్స్ మత్తులో ఉన్నది ముమైత్ ఖానే...

తెలుగు సినీ జగత్తు మత్తులో ఊగుతోందన్నది అందరికీ తెలిసిందే. అందులో ప్రధానంగా 8 మంది ...

news

పటేల్ సర్ రివ్యూ రిపోర్ట్-రివేంజ్ డ్రామా: జగపతి బాబు వన్ మేన్ షో.. నటన అదుర్స్

సింథటిక్ డ్రగ్‌‌ను దేశంలోని యువత మొత్తానికి అలవాటు చేయాలని దేవరాజ్ అలియాస్ డీఆర్ (కబీర్ ...

news

టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం: ప్రముఖులకు నోటీసులు.. మాకేపాపం తెలియదంటూ..?

టాలీవుడ్‌లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఇప్పటికే డ్రగ్స్ దందాలో మొత్తం 40 మంది టాలీవుడ్ ...

Widgets Magazine