గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (11:40 IST)

'సెల్ఫీ క్వీన్‌' కరీనా కపూర్.. ఆడపిల్ల పుడితే సైఫీనా అనే పేరు పెడుతుందా?

సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసింది. ఎటు చూసినా క్లిక్.. క్లిక్ శబ్దాలే... ఎటు చూసినా సెల్ఫీల సందడే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలతో ప్రతి నిమిషం బిజీగా ఉం

సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసింది. ఎటు చూసినా క్లిక్.. క్లిక్ శబ్దాలే... ఎటు చూసినా సెల్ఫీల సందడే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలతో ప్రతి నిమిషం బిజీగా ఉండే నెటిజన్ల సంగతి చెప్పనక్కరలేదు. బొమ్మ దిగాల్సిందే... ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో పడాల్సిందే. సెల్ఫీలంటే పడి చచ్చేవారిలో మన బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌కు ఫస్ట్‌ ప్లేస్‌ ఇవ్వొచ్చు. 
 
ఎందుకంటే తనను తాను ఆమె 'సెల్ఫీ క్వీన్‌'గా పేర్కొంది. ప్రతీ ఐదు నిమిషాలకో సారి సెల్ఫీ తీసుకుంటే గానీ ఆమెకు మనశ్శాంతి ఉండదట. 'వోగ్‌ బీఎఫ్‌ఎఫ్స్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ''నేనో సెల్ఫీ క్వీన్‌ని. ఎల్లప్పుడూ నన్ను నేను ఫొటోలు తీసుకుంటూనే ఉంటా. ప్రతీ 5 నుంచి 10 నిమిషాలకు ఓసారి సెల్ఫీ తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది కరీనా. 
 
తన కెరీర్‌ గురించీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కరీనా డిసెంబర్‌లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. రీనా తమకు ఆడపిల్ల పుడితే ''సైఫీనా'' అని పేరు పెట్టాలనుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  ప్రస్తుతం ఆమె 'వీర్‌ డి వెడ్డింగ్‌' చిత్రంలో నటిస్తూ బిజి బీజీగా ఉంటోంది.