శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శనివారం, 22 నవంబరు 2014 (15:25 IST)

ఇలియానా బుగ్గలు లాక్కుపోయి.... ముఖం పీక్కుపోయి... జీరో సైజ్‌ ఎఫెక్టేనా...?

హీరోలకు 6 ప్యాక్‌ ఎలాగో హీరోయిన్లకు జీరో సైజ్‌ అలాగ. హీరోలు బాడీని కష్టపెట్టి.. తిండి పరిమితంగా తింటూ బాడీని షేప్‌కు తీసుకువస్తారు. మాస్‌ యాక్షన్‌ ఫైట్లకు అనులకూంగా ఆకర్షణీయంగా వుంటుందని. హీరోయిన్లు మాత్రం జీరో సైజ్‌తో నాజూగ్గా వుండడానికి.. వయస్సు పెరిగినా బాడీలో మార్పు రాలేదనడానికి అటువైపు వెళతారు. దానికి తగినట్లు కొన్ని జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటిస్తారు. 

 
ఈ విషయంలో చాలామంది హీరోయిన్లు పాటించినా... కొందరిలో ముఖం కళ తప్పుతుంది. ఇటీవలే ఓ ఫంక్షన్‌కు ఇలియానా హాజరైంది. ఆమెను చూసిన చాలామంది ఇలియానానేనా అనే అనుమానం వ్యక్తం చేశారు. నాజూగ్గా  వున్నా... ఫేస్‌లో బుగ్గలు లాక్కుపోయి ముఖం పీక్కుపోయి బక్కచిక్కినట్లు.. ఏదో పేషెంట్‌గా వున్నట్లు అనిపించింది. దీంతో కొంతమంది ఫ్యాన్స్ ఆమె ఫిగర్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారట.
 
ప్రస్తుతం ఆమెకు తెలుగులో సినిమాలు పెద్దగా లేవు. ఆమె మేనేజర్‌ గిరిధర్‌ నిర్మాతగా లక్ష్మీరావే మా ఇంటికి ఫంక్షన్‌కు ఆహ్వానం మేరకు వచ్చింది. ప్రస్తుతం ఆయన ద్వారానే మరలా అవకాశాలు  కోసం ట్రై చేస్తుంది. అయితే ఈమె నాజూకుతనం నచ్చితేనే ఏ హీరో అయినా తీసుకునేది. చూద్దాం ఏం జరుగుతుందో.