Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ కారణంగా ఓ తెలుగు హీరోతో ఆరేళ్ళు డేటింగ్ చేశా : ఇలియానా

గురువారం, 6 జులై 2017 (11:18 IST)

Widgets Magazine

తెలుగు చిత్రపరిశ్రమకు దిగుమతి అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన భామల్లో ఇలియానా ఒకరు. ఈ గోవా బ్యూటీ ఆరేళ్ళ పాటు ఓ తెలుగు హీరోతో డేటింగ్ చేసిందట. ఇలా డేటింగ్ చేయడానికి గల కారణాన్ని కూడా ఆమె వెల్లడించింది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... టీనేజ్‌లోని హార్మోన్ల ప్రభావం వల్ల ఓ తెలుగు హీరోతో ఆరేళ్లపాటు డేటింగ్‌ చేశానని చెప్పింది. అయితే ఆ తర్వాత అతనితో విడిపోయినట్టు తెలిపింది. అయితే ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు.
ileana
 
అలాగే కాస్టింగ్‌ కౌచ్‌ అనేది హీరోయిన్ల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుందని, సొంత ప్రతిభను నమ్ముకున్నంత వరకు ఎవరికీ దాసోహం అవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. అంతేకాకుండా, తను 15 ఏళ్ల వయసులోనే ఓ తెలుగు సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టానని చెప్పింది. ఆ తర్వాత ఆ తెలుగు హీరోతో డేటింగ్ చేయాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ డేటింగ్ తన ఇష్టపూర్వకంగానే జరిగినట్టు తెలిపింది. 
 
కాగా, ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొంది ఆ తర్వాత బాలీవుడ్‌కి ఈ గోవా బ్యూటీ మకాం మార్చింది. అయితే బాలీవుడ్‌లో ఆమె అనుకున్నంతగా సక్సెస్‌ కాలేకపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉంది. తను, ఆండ్రూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కృష్ణవంశీ "నక్షత్రం" సినిమా ట్రైలర్ (Video)

సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర నక్షత్రం. ఈ చిత్రంలో సందీప్ ...

news

మలయాళంలో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం లేదట.. వాపోతున్న ఇన్నోసెంట్

మహిళలపై సంచలన మలయాళ సినీ సీనియర్ నటుడు ఇన్నోసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మలయాళ ...

news

ఆసుపత్రి తీసిన ప్రాణం... దాసరి అన్యాయమైపోయారా

మనిషి చనిపోయాక ఎందుకు, ఎలా పోయాడు, కారణం ఎవరు వంటి ప్రశ్నలు సంధించడం నిష్ప్రయోజనమే ...

news

ఉయ్యాలవాడలో అనుష్క... చిరు సగం గట్టెక్కేసినట్లే మరి

బాహుబలి 2 లో దేవసేన పాత్రలో ఒలికించిన ఆ రాజసం చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా ...

Widgets Magazine