శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (09:29 IST)

బాలీవుడ్ నటులతో సన్నిహితంగా ఉంటున్న అనుష్క.. కోహ్లీలో అభద్రతా.. అందుకే ఎడబాటునా?

బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ, క్రికెట్ స్టార్ బ్యాట్స్ మాన్ విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు పేర్లు ఎక్కడ వినిపించినా వారి ప్రేమాయణం గుర్తుకు వస్తుంది. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రేమించుకున్నవీరిద్దరు ఈ మధ్య

బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ, క్రికెట్ స్టార్ బ్యాట్స్ మాన్ విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు పేర్లు ఎక్కడ వినిపించినా వారి ప్రేమాయణం గుర్తుకు వస్తుంది. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రేమించుకున్నవీరిద్దరు ఈ మధ్య దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల కాస్త బ్రేకప్ వచ్చిన ఈ జంట ఇప్పుడు మళ్లీ సెట్‌రైట్ అయ్యిందట. 
 
అందుకు తాజాగా మీడియా ముందే ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేసుకుంటూ కనిపించిన సంగతి తెలిసిందే. భారత మ్యాచ్‌ల సందర్భంలో ఈ జంట అనేకమార్లు స్టేడియాల్లో కలిసి దర్శనమిచ్చారు. తాజాగా విరాట్‌కోహ్లితో అనుష్కశర్మ ప్రేమ వ్యవహారం బ్రేకప్ వరకు వచ్చిందని బాలీవుడ్ వర్గాల్లో మళ్లీ వినిపిస్తోంది. 
 
ఇదిలావుండగా వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడానికి అనుష్కశర్మ బిజీ షెడ్యూల్స్ కారణమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వరుస సినిమా షూటింగ్‌ల కారణంగా విరాట్‌తో గడిపేందుకు అనుష్కశర్మ తగిన సమయాన్ని కేటాయించలేకపోతోందని, ఈ విషయంలో విరాట్ అసంతృప్తిగా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అంతేకాకుండా... తోటి బాలీవుడ్ నటులతో అనుష్కశర్మ సన్నిహితంగా ఉండటం విరాట్‌కు నచ్చలేదని, ఆయన అభద్రతా ఉన్నారని చెబుతున్నారు. అనుష్కశర్మ నటించే సినిమా సెట్స్‌కు తరచూ వెళ్లే విరాట్‌కోహ్లి ఇటీవల కాలంలో షూటింగ్‌లకు చాలా దూరంగా వుంటున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ఈ జంట బ్రేకప్‌కు సిద్ధపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.