Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జబర్దస్త్‌పై నిషేధం - ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చు...?!!

గురువారం, 18 మే 2017 (17:27 IST)

Widgets Magazine

జబర్దస్త్... నవ్వులే.. నవ్వులు.. ఈ కార్యక్రమం ప్రారంభమైన తరువాత ఈటీవీని చూసే వారి సంఖ్య మరింత పెరిగింది. సాధారణ ఎంటర్ టైన్ మెంట్ల కన్నా జబర్తస్ వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్‌లో ఆ ఛానల్ టాప్‌లో నిలవడానికి జబర్దస్ ఒక ప్రధాన కారణమైంది. మొదట్లో జబర్దస్త్ అంటే పడిపడి నవ్వేవాళ్ళు.. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు లేకుండా సాధారణ సరళిలో తమాషాగా డైలాగ్‌లు ఉంటూ ఇంటిల్లిపాది నవ్వుకునేవారు. ఇక రాను రాను స్కిట్‌లు చేసేవారు మరింత రెచ్చిపోయారు. బూతులే బూతులు... డబుల్ మీనింగ్ డైలాగ్‌లు‌.. అమ్మాయి వేషధారణలో అబ్బాయి. ఇక ఆ వేషధారణలో ఉన్న వ్యక్తిని ఆడుకుంటారు... ఒకరకంగా.. మామూలుగా కాదు.. నోరు తెరిస్తే డబుల్ మీనింగ్ బూతులే.
roja-nagababu
 
దీంతో జబర్దస్త్‌ను మహిళలు చూడటం మానేశారు. యువకులు ఎక్కువగా చూడటం ప్రారంభించారు. అంతేకాదు.. కొంతమంది మహిళలైతే ఏకంగా సెన్సార్ బోర్డుకే ఫిర్యాదులు చేశారు. మరికొంతమంది మనకెందుకులే అని మౌనంగా వుండిపోయారు. కంప్లైంట్ ఇచ్చినవారు వేరే ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతోనే సెన్సార్ బోర్డును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
 
జబర్దస్త్ మీద ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ఇక సెన్సార్ బోర్డు కూడా ఆ ఛానల్‌‍కు ఛీవాట్లు పెట్టింది. ఆ కార్యక్రమాన్ని ఎత్తివేయాలని ఆదేశించిందట. అయితే కొంత సమయం కావాలని ఛానల్ యాజమాన్యం సెన్సార్ బోర్డును రిక్వెస్ట్ చేయగా అందుకు సభ్యులు ససేమిరా అన్నారట. ఏ క్షణంలోనైనా ఆ కార్యక్రమాన్ని ఆపేయాలన్న ఆదేశాలు ఉండటంతో ఆ ఛానల్ నిర్వాహకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దేవసేన భల్లాలదేవుడితో రొమాన్స్ చేసిందా? ఇదిగోండి వీడియో..

ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి - ది కన్‌క్లూజన్ గురించి ...

news

రారండోయ్ వేడుక చూద్దాం.. భ్రమరాంబకు నచ్చేశాను.. పాట రిలీజ్.. నాగ్ ట్వీట్.. (వీడియో)

అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పాటలను ...

news

బాలీవుడ్ అలనాటి తార రీమా లగూ ఇక లేరు..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు వదినగా నటించిన.. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ...

news

సుశాంత్ తండ్రి మృతి.. విషాదంలో అక్కినేని ఫ్యామిలీ

అక్కినేని ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు (68) ...

Widgets Magazine