వై.ఎస్.ఆర్ బ‌యోపిక్‌లో మ‌రో తెలుగు న‌టుడు..?

వై.ఎస్ జీవిత చ‌రిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో వై.ఎస్ పాత్ర‌ను మ‌ల‌యాళ అగ్ర‌హీరో మ్ముట్టి పోషిస్తున్నారు. మ‌హి వి రాఘ‌వ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుం

JagapathyBabu
srinivas| Last Modified సోమవారం, 2 జులై 2018 (12:49 IST)
వై.ఎస్ జీవిత చ‌రిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో వై.ఎస్ పాత్ర‌ను మ‌ల‌యాళ అగ్ర‌హీరో మ్ముట్టి పోషిస్తున్నారు. మ‌హి వి రాఘ‌వ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో ఓ మ‌హిళా నాయ‌కురాలు పాత్ర‌కు అన‌సూయ‌ను తీసుకున్నారు. తాజాగా మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది  ఏంటంటే... ఈ సినిమాలో న‌టించేందుకు తెలుగు న‌టులు అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ట‌. 
 
ఇందులో న‌టిస్తోన్న తెలుగు యాక్ట‌ర్ రావు ర‌మేష్. లేటెస్ట్‌గా మ‌రో యాక్ట‌ర్ ఇందులో న‌టించేందుకు ఓకే చెప్పార‌ట‌. అత‌నే జ‌గ‌ప‌తిబాబు. అవును జ‌గ‌ప‌తి ఈ సినిమాలో న‌టించేందుకు ఓకే అన్నారని తెలిసింది. ఆయ‌న వై.ఎస్ తండ్రి రాజారెడ్డి పాత్ర‌ను పోషిస్తున్నార‌ట‌. నాజ‌ర్ కూడా ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తోన్న ఈ సినిమాని జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రిలో ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా వ‌స్తోంది. మ‌రి... ఈ పోటీలో ఎవ‌రు గెలుస్తారో చూడాలి.దీనిపై మరింత చదవండి :