శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (13:06 IST)

'జనతా గ్యారేజ్' కోసం మెగా ఫ్యాన్స్ రెడీ...? ఎన్టీఆర్‌కు చిరు ఫోన్...

జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఫీవర్ ఓ రేంజిలో హీటెక్కిపోతోంది. ముఖ్యంగా జనతా గ్యారేజ్ షో కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు మెగాస్టార్ అభిమానులు కూడా ఎగబడుతున్నారట. అసలు సంగతి ఏంటయా అంటే... మెగాస్ట

జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఫీవర్ ఓ రేంజిలో హీటెక్కిపోతోంది. ముఖ్యంగా జనతా గ్యారేజ్ షో కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు మెగాస్టార్ అభిమానులు కూడా ఎగబడుతున్నారట. అసలు సంగతి ఏంటయా అంటే... మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఫోన్ చేశారట. ఎందుకూ అని అంటారా... మరేం లేదు జనతా గ్యారేజ్ చిత్రం గురించే.
 
ఆ చిత్రం థీమ్, దానికి సంబంధించిన ట్రెయిలర్స్, స్టిల్స్ అన్నీ చూశాక తనకు చాలా నచ్చాయని చిరంజీవి చెప్పారట. అంతేకాదు ఈ చిత్రం కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుందని దీవించారట కూడా. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి ఇలా అభినందించేసరికి జూనియర్ ఎన్టీఆర్ పట్టరాని సంతోషంలో మునిగిపోయారట. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీ హీరోలతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుండటంతో ఆయన చిత్రాన్ని చూసేందుకు మెగాస్టార్ అభిమానులు కూడా రెడీ అయిపోయారట.