గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: గురువారం, 30 జులై 2015 (18:50 IST)

రామ్ చరణ్ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్... ఫ్యాన్స్‌కి ఖుషీయే...!!

ఒకప్పడు ఇద్దరు పేరున్న హీరోలు.. ఎడమొహంపెడమొహంగా వుండేవారు. మీడియా వారికి అది మంచి రుచిరకమైన వార్తగా వుండేది. కానీ ఇప్పటి ట్రెండ్‌ అందుకు విరుద్ధంగా వున్నారు. జనరేషన్‌ మార్పే దానికి కారణంగా చెబుతుంటారు. మా తరానికి ఇప్పటి తరానికి చాలా తేడా వుందనీ, ఇప్పటితరం ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటారనీ, ఒకరి క్షేమం మరొకరు కోరుకుంటారని.. ఇటీవలే మోహన్‌ బాబు వ్యాఖ్యానించారు.
 
ఒకరి సినిమా విడుదలైతే ఆ సినిమా గురించి వీరితో మాట్లాడుతుంటారు కూడా. ఒకరి సినిమాకి మరొకరు క్లాప్‌ కొడుతుంటారు. వీలుంటే ఒకరి సినిమాకి మరొకరు వాయిస్‌ ఓవర్‌ అందిస్తుంటారు. కాగా సినిమాల పరంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ వాస్తవానికి రియల్‌ లైఫ్‌లో వారిద్దరూ మంచి క్లోజ్‌ ఫ్రెండ్స్‌. 
 
తాజా విశేషం ఏమిటంటే... ప్రస్తుతం రామ్‌ చరణ్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఇంతకంటే మంచి వాతావరణం ఏముంటుందని ఫిలింనగర్‌లో అనుకుంటున్నారు.