శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 24 మే 2016 (08:58 IST)

''మలయ్'' భాషలో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రం ''కబాలి''

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ''కబాలి''. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రికార్డుల వర్షం కురిపిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్‌గా, దినేశ్ రవి, ధన్సిక, జాన్ విజయ్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ విడుదలై ఇప్పటికే  ఈ ట్రెలర్‌ను రెండు కోట్ల మంది వీక్షించారు. దాంతో అత్యధిక వీక్షకులు వీక్షించిన ట్రైలర్‌గా యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. మాఫియా నేపథ్యంలో సాగుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

రజినీ కున్నమాస్ ఫాలోయింగ్ కారణంచేత ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతుండగా.. తాజాగా మలేషియా భాష అయిన మలయ్‌లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. మలేషియాలో తమిళ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉందని అందరికి తెలిసిన విషయమే. మలయ్ భాషలో విడుదల అవుతున్న తొలి తమిళ చిత్రంగా ''కబాలి'' అరుదైన ఘనతను సొంతం చే‌సకుంది.

ఎక్కువ శాతం ఈ చిత్రం మలేషియాలో షూటింగ్ జరుపుకోవడం, మలేషియా నటులు ఈ చిత్రంలో నటించడంతోనే ఈ చిత్రాన్ని మలయ్‌లో విడుదల చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలేషియా మీడియా కంపెనీ ''మాలిక్ స్ట్రీమ్ ప్రొడక్షన్స్'' ఈ చిత్రాన్ని మలేషియాలో విడుదల చేయనుంది.