శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (10:28 IST)

'కిస్ ఆఫ్ లవ్‌'లో పాల్గొన్న ఆ ఇద్దరు హీరోయిన్లు.. ఎక్కడ.. ఎవరితో!!

ఈ మధ్యకాలంలో కిస్ ఆఫ్ లవ్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అనేక నగరాల్లో ఈ తరహా కార్యక్రమం చేపట్టేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకునే కార్యక్రమం నిర్వహణ కోసం తమకు అనుమతి ఇవ్వాలంటూ వారు ఆయన ప్రాంతాల పోలీసులకు విజ్ఞప్తులు చేయడం, వారు నిరాకరించడం, ఈ విషయంపై ధర్నాలు చేయడం పరిపాటిగా మారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు హీరోయిన్లు కిస్ ఆఫ్ లవ్‌లో పాల్గొన్నారు. వారు ఎవరో కాదు. కాజల్ అగర్వాల్, అమలా పాల్. ఇటీవల జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వీరిద్దరు బహిరంగంగా ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్నారు. 
 
వేదికపైకి చేరిన వెంటనే వీరిద్దరు ఒకరినొకరు పలుకరించుకుని.. ఆ తర్వాత తమ నవ్వును ఆపేసి.. ఒకరి బుగ్గపై మరొకరు ముద్దుపెట్టుకున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా ఈ ఇద్దరు హీరోయిన్ల వైపే చూస్తుండిపోయారట. ఎంతైనా వెండితెర హీరోయిన్లు కదా. వీరికిది సర్వసాధారణమే కదా.!!