శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 7 అక్టోబరు 2014 (18:08 IST)

బొద్దుగా మారిన కాజల్ అగర్వాల్... అడిగినంత ఇస్తున్నందుకేనట...

నటి కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల చాలా బొద్దుగా కన్పించింది. గోవిందుడు అందరివాడేలో.. తను రామ్‌చరణ్‌ కంటే ఎత్తుగానూ, బొద్దుగా కన్పించింది. ఇది సహజమేననీ, కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆటోమెటిక్‌గా బొద్దుగా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. 
 
ఐనా తను పారితోషికం ఎక్కువ తీసుకుంటున్నట్లు చెన్నైలో వస్తున్న వార్తలను ఖండిస్తూ... ఎవరైనా ఊరికే ఎందుకు ఇస్తారు. వారికి మొత్తానికి సరిపడా వర్క్‌ చేసినందుకే ఇస్తారు. నేను అడిగాను కదా అని ఎంతబడితే అంత ఇచ్చేయరు కదా అంటూ తేల్చి చెబుతోంది. ప్రస్తుతం ఎన్‌టిఆర్‌తో కలిసి నటిస్తున్నాననీ, వైజాగ్‌లో షూటింగ్‌లో పాల్గొంటానని చెబుతోంది.