గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (09:49 IST)

నాదాన్ని తెగ వాడేసుకుని సడెన్‌గా దూరంగా పెట్టాడు.. స్నేహితుల వద్ద వాపోతున్న కాజల్

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కుమిలిపోతోంది. బాలీవుడ్ హీరో ఒకరు ఆమెను సడెన్‌గా దూరం పెట్టేశాడు. దీన్ని ఆమె జీర్ణించుకోలేక పోతోంది. నిజానికి కాజల్ అగర్వాల్‌కు గత కొన్ని రోజులుగా సరైన అవకాశాలు లేక అల

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కుమిలిపోతోంది. బాలీవుడ్ హీరో ఒకరు ఆమెను సడెన్‌గా దూరం పెట్టేశాడు. దీన్ని ఆమె జీర్ణించుకోలేక పోతోంది. నిజానికి కాజల్ అగర్వాల్‌కు గత కొన్ని రోజులుగా సరైన అవకాశాలు లేక అల్లాడిపోతోంది. ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో చాన్స్ కొట్టేయడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది. అలాగే బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం కూడా దక్కింది. 
 
అలాగే, బాలీవుడ్‌లో అవకాశాల కోసం చేసిన ప్రయత్నం విజయవంతమై షాహిద్ కపూర్‌ సరసన నటించేందుకు ఎంపికైంది. ఈ సినిమా కథా చర్చల సమయంలో షాహిద్‌తో విపరీతమైన చనువు ఏర్పడిందట. ఆ సందర్భంగా తన లగ్జరీ కారును షాహిద్ విపరీతంగా వాడుకున్నాడట. అయితే చివరికి సినిమా తెరకెక్కుండా కథా చర్చల సమయంలోనే చతికిల పడింది. సినిమా ఆగిపోయన తర్వాత షాహిద్ సడెన్‌గా తనతో మాట్లాడడం మానేశాడని, కనీసం ఫోన్ కూడా చేయలేదంటూ స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తోందట.