శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (16:10 IST)

కమల్ హాసన్ - శృతి హాసన్‌ల చిత్రం పేరు 'శభాష్ నాయుడు'

లోకనాయకుడు, పద్మశ్రీ కమల్‌హాసన్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా ఓ చిత్రం రూపొందుతుంది. హిందీలో ''శభాష్ కుందు'', తెలుగు, తమిళ భాషల్లో ''శభాష్ నాయుడు'' అనే టైటిల్‌తో సినిమాని తీయబోతున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేసినట్లు కమల్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో కమల్‌హాసన్ యమా స్పీడుగా బైక్ నడుపుతూ వెనకున్న బ్రహ్మానందాన్ని గాబరాపరుస్తున్నట్టుగా ఉంది. 
 
చూడడానికి సరదాగా, వింతగా ఉన్న ఈ పోస్టర్ కమల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 2008లో విడుదలైన ''దశావతారం'' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రంలో బలరాం నాయుడు అనే పాత్రను పోషించిన కమల్‌హాసన్ మళ్లీ ఈ చిత్రంలో అదే పాత్రలో నటించి అందరిని కడుపుబ్బ నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. ఈయనకు అసిస్టెంట్‌గా బ్రహ్మానందం నటిస్తున్నారు. 
 
కమల్ గారాల పట్టి  శ్రుతిహాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. రమ్యకృష్ణ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత మాంత్రికుడు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మే రెండోవారం నుంచి ప్రారంభమవుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.