నేను కోరుకున్నది జరగదు.. అందుకే పెళ్లి పెటాకులైంది.. కంగనా రనౌత్ హ్యాపీ

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది. తాను కావాలనుకున్నది ఏదీ దొరకదని.. అది కాస్త చెడే జరిగితీరుతుందని కంగనా తెలిపింది. తాను పెళ్లి చేసుకోవాలని చాలాసార్ల

Kangana Ranaout
selvi| Last Updated: బుధవారం, 4 జులై 2018 (10:35 IST)
బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది. తాను కావాలనుకున్నది ఏదీ దొరకదని.. అది కాస్త చెడే జరిగితీరుతుందని కంగనా తెలిపింది. తాను పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నానని, కానీ అది జరగకపోవడం సంతోషంగా ఉందని చెప్పింది. తన విఫలమైన తర్వాత దేవుడే తనను కాపాడాడని అనుకున్నానని తెలిపింది. 
 
తాను ఏది కావాలనుకున్నా.. అందుకు తాను అనర్హురాలినని.. చాలామంది తక్కువ అంచనా వేశారని చెప్పింది. తనకు కావాలనుకున్నప్పుడు దక్కకపోతే పోరాడానని.. కన్నీళ్లు పెట్టుకున్నానని కంగనా తెలిపింది. అందుకే తాను దేవుడిపై భారం వేశానని తెలిపింది. ఆ భగవంతుడు తాను ఏది కోరుకుంటే అది ఇవ్వకుండా తన పట్ల చాలా దయతో వ్యవహరించాడని చెప్పింది. 
 
మోడలింగ్‌ చేసి, తన తల్లిదండ్రుల దగ్గర తానేంటో నిరూపించుకోవాలి అనుకున్నానని, కానీ మోడలింగ్‌ ప్రపంచం తనను తిరస్కరించిందని కంగనా రనౌత్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను కోరుకున్న చాలా విషయాల్లో ఇలాగే జరిగిందని కంగనా వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :