Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రంగస్థలం 1985లో కరీనా కపూర్ స్టెప్పులు.. పవన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్?

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (17:09 IST)

Widgets Magazine

మగధీర... రామ్ చరణ్ తాజా సినిమా రంగస్థలం 1985. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా దసరాకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఐటమ్ సాంగ్ చేయనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
బాలీవుడ్‌లో హీరోయిన్‌గానే  కాకుండా ఐటమ్ గర్ల్‌గా మంచి మార్కులు వేసుకున్న ఈ ముద్దుగుమ్మను ఎలాగైనా రంగస్థలంలో స్టెప్పులు వేయించాలని దర్శకుడు సుకుమార్ మల్లగుల్లాలు పడుతున్నారట. స్కిప్ట్ర్ ప్రకారం కరీనా సాంగ్ ఈ చిత్రంలో వుంటే తప్పకుండా సినిమా బంపర్ హిట్ అవుతుందని సమాచారం. ఈ సినిమా ఐటమ్ గర్ల్ రేసులో ప్రియాంకా చోప్రా కూడా వున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు ఈ సినిమా ఫస్ట్ లుక్ దసరాకు రానుంది. హైదరాబాదు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను పవర్ స్టార్ విడుదల చేస్తారని.. దసరాకు చెర్రీ సినిమా ఫస్ట్ లుక్ అవుట్ అవుతుందని టాక్. ఈ సినిమాలో చెర్రీ సరసన తొలిసారి సమంత నటిస్తుంది. అనసూయ, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది.   Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగ్ బాస్ ఓవర్.. నాతోనే డ్యాన్స్ రెడీ: ఉదయ భానుతో రేణు సెల్ఫీ (ప్రోమో వీడియో)

బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన నేపథ్యంలో త్వరలోనే స్టార్ మా ఛానల్‌లో ''నాతోనే డ్యాన్స్''అనే ...

news

హనీప్రీత్‌కు అసూయ.. గుర్మీత్ నన్ను పెళ్లి చేసుకుంటే.. సవతి అవుతానని భయపడేది: రాఖీ

బాలీవుడ్ సెక్సీబాంబ్ రాఖీ సావంత్ తాజాగా డేరా బాబా బయోపిక్‌లో హనీప్రీత్ సింగ్ పాత్రలో ...

news

'కేరాఫ్ సూర్య' అంటున్న సందీప్ కిషన్... (Teaser)

యువ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా దర్శకుడు సుశీంద్రన్ 'కేరాఫ్ సూర్య' అనే చిత్రం ...

news

మహాభారతం నా కల మాత్రమే.. సినిమా తీస్తానని చెప్పలేదు: రాజమౌళి

బాహుబలి దర్శకుడు జక్కన్న మహాభారతంపై సంచలన కామెంట్ చేశారు. త్వరలో రాజమౌళి మహాభారతం ...

Widgets Magazine