శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శనివారం, 13 సెప్టెంబరు 2014 (14:48 IST)

సంస్కారం తెలీనోడికి అవార్డా... రాఘవేంద్రరావుపై మురారి సంచలన వ్యాఖ్యలు

దర్శకుడు రాఘవేంద్రరావుకు సభ్యత, సంస్కారం ఏమీ తెలియవనీ, అటువంటి వ్యక్తికి డాక్టరేట్‌ ఇవ్వడం కరెక్ట్‌ కాదని ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి అంటున్నాడు. వైజాగ్‌ గీతం యూనివర్సివటీ రాఘవేంద్రావును, సుద్దాల అశోక్‌తేజ్‌కు డాక్టరేట్‌తో సంత్కరించనుంది. శనివారం నాడు వైజాగ్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా రెండు రోజులుగా మద్రాసు నుంచి మురారి స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు. 
 
మురారి నిర్మాతల గురించి పుస్తకం రాశారు. అందులో రాఘవేంద్రరావు చేసిన నిర్వాకాలు కూడా వెల్లడించారు. నిర్మాతలను ఎలా ఇబ్బంది పెట్టారో కూడా చెప్పారు. ఇటీవలే 'ఇంటింటా అన్నమయ్య' అనే చిత్రం కూడా విడుదల కాలేదు. దానికి రాఘవేంద్రావు దర్శకుడు. కాగా రాఘవేంద్ర రావును జనాలు మర్చిపోతున్న సమయంలో ఓ ఛానల్ వారు ఓ కార్యక్రమం నిర్వహించారనీ, అందువల్ల మళ్ళీ ఆయన జనాలకు రీచ్ అయ్యారనే కామెంట్లు కూడా వస్తున్నాయి.
 
అంతేకాదు ఓసారి రామానాయుడు స్టూడియోలో ఓ కార్యక్రమానికి రాఘవేంద్ర రావు హాజరైతే ఆయనతో అక్కడి జనాలు ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారట. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు టీవీ వల్ల వచ్చిందని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారట. బహుశా ఆ టీవీనే ఈయనకు గుర్తింపు అవార్డు తెప్పిస్తుందేమోనన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఇలాంటి గాలికబుర్లు మామూలే కదా అని మరో వర్గం అంటోంది.