శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Eswar
Last Modified: శనివారం, 9 ఆగస్టు 2014 (10:25 IST)

బార్బీ గాళ్ కత్రినా పెళ్లి ఫిక్సయ్యంది

బాలీవుడ్‌లో మరో వెడ్డింగ్ బెల్‌ మోగనుంది. ఫ్యామిలీ రాకుమారుడు రణ్‌బీర్‌, బార్బీ డాల్‌ కత్రీనా ఫింగర్‌కు రింగ్‌ తొడిగేయనున్నాడు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు ఈ మిల్కీబాయ్. 
 
దేవదాసు అవతారమెత్తిన రణ్‌బీర్‌... 
దీపికాతో లవ్వు చెడిన తరువాత దాదాపుగా దేవదాసు అవతారమెత్తిన రణ్‌బీర్‌ను పీకల్లోతు ప్రేమలో ముంచేసింది కత్రినా. అజబ్‌ ప్రేమ్‌కీ గజబ్ కహానీ సినిమాతో మొదలైన వీరి లవ్వాయణం చాల దూరమే పయనించింది. మొదట అదేమీ లేదని చెప్పిన ఈ జంట ఆ తరువాత ఫారిన్‌లోని ఓ బీచ్‌లో కెమెరాకు అడ్డంగా దొరికిపోవడంతో లవ్వే కాదు అంతకంటే ఎక్కువే ఉందని ఒప్పుకోక తప్పలేదు.
 
రెండు ఫ్యామిలీలు కలిసి డిన్నర్‌....
తాజాగా కత్రినా రణ్‌బీర్‌ తల్లిదండ్రులు రిషికపూర్‌, నీతూలను వెళ్లి కలవడంతో ఈ జంట పెళ్లికి రెడీ అయిపోయిందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఈ రెండు ఫ్యామిలీలు కలిసి డిన్నర్‌ కూడా చేశాయట. కత్రినా రణ్‌బీర్‌ తల్లి నీతూను బాగానే ఇంప్రెస్‌ చేసిందని సన్నిహితవర్గాల సమాచారం.
 
లండన్ కు రణ్ బీర్...
ఇక ఇప్పుడు రణ్‌బీర్‌ వంతు వచ్చింది. మాజీ ప్రియురాలు దీపికాతో కలిసి తమాషా మూవీ షూటింగ్‌ కోసం ఫ్రాన్స్‌ కొర్‌సికాలో ఉన్న రణ్‌బీర్‌... త్వరలో లండన్‌ వెళ్లనున్నాడు. అయితే లండన్‌ ట్రిప్పు షూటింగ్‌ కోసం కాదు... కత్రినా తల్లిదండ్రులను కలవడానికి. తమ పెళ్లి ప్రపోజల్ వారి ముందు ఉంచి వారితో ఊ కొట్టించడానికి రణ్‌బీర్‌ లండన్‌కు వెళ్లనున్నాడు. దీన్ని బట్టి బాలీవుడ్‌ వర్గాలకు మరో గ్రాండ్ పార్టీ ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది