Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీకు దండం పెడతా... మహేష్‌ పక్కన నటించను.. ఎవరు..?

మంగళవారం, 6 జూన్ 2017 (13:22 IST)

Widgets Magazine

మిల్కీ బాయ్... మహేష్‌ బాబు. ఆయన పక్కన నటించాలంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్‌గా పేరున్న మహేష్ బాబు ఆ తరువాత నమ్రతా శిరోద్కర్‌ను వివాహం చేసేసుకున్నారు. మహేష్ బాబు వివాహానికి... సినిమాలకు ఏం సంబంధం అనుకుంటున్నారా. అదేనండి ఇక్కడ ట్విస్ట్.. పెళ్ళయిన హీరోలతో నటించేది లేదని కొంతమంది హీరోయిన్లు దర్శకులకు తేల్చిచెబుతున్నారట. అందులో కీర్తి సురేష్‌ ఒకరు.
keerthi suresh
 
తమిళ చిత్రసీమ ద్వారా పరిచయమైన కీర్తి సురేష్‌ కొద్ది రోజుల్లోనే మంచి పేరును సంపాదించుకున్నారు. కుష్భూ తరువాత తమిళీయులు గుడి కట్టిన హీరోయిన్లలో కీర్తి సురేష్‌ ఒకరు. గత కొన్నిరోజుల ముందు మహేష్ బాబుతో ఒక సినిమాను ప్లాన్ చేసుకున్న ఒక దర్శకుడు హీరోయిన్‌గా కీర్తి సురేష్‌‌ను పెట్టాలని నిర్ణయించుకున్నాడట. 
 
మహేష్ బాబు కూడా అందుకు ఒకే అని చెప్పారట. అతడు తరహాలోనే సినిమా యాక్షన్‌ తరహాలో తీయాలన్నదే దర్శకుడి ఆలోచన. ఈ సినిమాలో కీర్తి సురేష్‌‌ను హీరోయిన్‌గా పెట్టనున్నట్లు మహేష్‌కు తెలిపారట దర్శకుడు. మహేష్ హీరోయిన్ల విషయంలోను, సహ నటుల విషయంలోను ఎప్పుడూ పట్టించుకోరు. దర్శకనిర్మాతలు ఏది చెబితే అది వినడం మహేష్‌కు అలవాటు. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.
 
దర్శకుడు నేరుగా కీర్తి సురేష్‌ వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాడట. అయితే ఆమె ఓవర్‌గా రియాక్టయి మహేష్ బాబుతో నటించను సర్.. మీకు దండం అంటూ చెప్పిందట. కీర్తి సురేష్‌ చెప్పిన మాటలతో నివ్వెరపోయారట ఆ దర్శకుడు. పెళ్ళయిన హీరోలతో నటిస్తే సినిమాల్లో తనకు క్రేజ్ తగ్గిపోతుందని కీర్తి చెప్పుకొచ్చారట. దీంతో దర్శకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఈ విషయం మహేష్‌కు తెలిసిపోయింది. 
 
అయితే స్వతహాగా మహేష్‌ మృదుస్వభావుడు కావడంతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కీర్తి వ్యవహారం కాస్త మహేష్‌ అభిమానులకు తెలిసిపోయింది. దీంతో మహేష్ అభిమానులు కీర్తిపై గుర్రుగా ఉన్నారట. ఇంతకీ ఆ దర్శకుడు యువ దర్శకుడేనట. మహేష్ బాబుతో సినిమా తీయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉండగా కీర్తి ఒక్కసారిగా హేండ్ ఇవ్వడంతో వేరే హీరోయిన్ కోసం వెతుక్కుంటున్నాడట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డీజే.. గుడిలో బ‌డిలో మ‌డిలో వ‌డిలో పాటలోని పదాల్ని తొలగిస్తాం: హరీష్ శంకర్

బన్నీ, ద‌ర్శకుడు హ‌రీశ్ శంక‌ర్ కాంబినేషన్‌లో వ‌స్తున్న ‘దువ్వాడ జ‌గ‌న్నాథం’ సినిమాలోని ...

news

పవన్‌కు మాజీ భార్యగానే మిగిలిపోతా.. రెండో పెళ్ళి మాత్రం చేసుకోను: రేణూ దేశాయ్

ఖుషీ, జానీ వంటి సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ సరసన నటించి ఆయన్నే మనువాడి.. ఆపై ఆయనకు ...

news

అమరేంద్ర బాహుబలి చనిపోతే... ధియేటర్లలో కంట తడి పెట్టని వారు లేరు ఎందుకు?

ఈరోజు సినిమాలో అమరేంద్ర బాహుబలి చనిపోతే... ధియేటర్లలో కంట తడి పెట్టని వారు లేరు. అంత ...

news

15రకాల బిర్యానీలు.. చేపల పులుసు.. చికెన్, మటన్ లాగించిన ప్రభాస్.. అవాక్కైన రాజమౌళి.. ఎక్కడ?

బాహుబలి 2 సినిమాకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ఇంకా ఆసక్తిని రేపుతూనే ...

Widgets Magazine