Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కీర్తి సురేష్‌కు కలిసిరాని భైరవ.. షూటింగ్‌కు ముందు రిహార్సల్.. గ్లామర్ రోల్స్‌కు ఓకే!

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:41 IST)

Widgets Magazine

నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ తాజాగా నాని సరసన 'నేను లోకల్‌' చిత్రంలో నటించింది. ఈ సినిమా రిలీజ్ కానున్న తరుణంలో పవన్‌ కల్యాణ్‌తో నటించడానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో మరో చిత్రంలో నటించడానికి కూడా కీర్తి సురేష్ అంగీకరించిందని టాలీవుడ్‌లో టాక్ వస్తోంది.

కానీ కోలీవుడ్‌లో మాత్రం అమ్మడుకు ఆఫర్లు సన్నగిల్లాయని టాక్ వస్తోంది. ఇటీవల యంగ్ యాక్టర్ విజయ్‌తో నటించిన భైరవలో కీర్తి సురేష్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని సమాచారం. ఈ వార్త ఆ నోటా ఈ నోట పడి ఎలాగో కీర్తి చెవికి చేరింది.
 
బిత్తరపోయిన కీర్తి కోలీవుడ్‌లో తిరిగి తన స్టార్‌డమ్‌ను పొందాలని నిశ్చయించుకుంది. ఇప్పుడు షూటింగ్‌కు ముందు రిహార్సల్‌ చేస్తోందని వినికిడి. ఎప్పుడూ సాధారణ లుక్‌తో కనిపించే కీర్తి కాస్తంత గ్లామర్‌గా కనిపించే కాస్ట్యూమ్స్‌ను సైతం ఎంపిక చేసుకుని, అభిమానులను ఆకట్టుకోవడానికి పాట్లు పడుతున్నట్లు సమాచారం. తెలుగులోనూ, తమిళంలోనూ నటనాపరంగా ఆకట్టుకునేందుకు కీర్తి మల్లగుల్లాలు పడుతోంది. 
 
ఇదిలా ఉంటే.. మహానటి పాత్రలో నటిస్తున్నట్టుగా చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్, మలయాళీ భామ నిత్యామీనన్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు.

ఈ లిస్ట్‌లో మరో పేరు వినిపిస్తోంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన కీర్తీ సురేష్‌ను ఈ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Keerthy Suresh Is Doing Rehearsal On Her Own

Loading comments ...

తెలుగు సినిమా

news

దాసరికి పవన్ పరామర్శ... ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు

సినీ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావుని హీరో పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ...

news

రామ చరణ్ - సుకుమార్ చిత్రానికి టైటిల్ "పల్లెటూరి ప్రేమలు"?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ...

news

మెగాస్టార్‌కి 10, జూనియర్ ఎన్టీఆర్‌కు 1.. ఏంటిది?

మెగాస్టార్ చిరంజీవికి పది, జూనియర్ ఎన్టీఆర్‌కి 1 అంటే ఏంటనుకుంటున్నారా.. ర్యాంకులండీ ...

news

నేనెవడితో తిరిగితే మీకెందుకోయ్.. నా బయోడేటా మొత్తం కావాలా అంటున్న నటీమణి

చూస్తుంటే ప్రపంచమంతటా మీడియా వ్యవహారం కానీ, ప్రజల ఆలోచనలు కాని ఒకేలాగా కనిపిస్తున్నాయి. ...

Widgets Magazine