Widgets Magazine Widgets Magazine

రామ్ చరణ్ వ్యవహారశైలికి బెదిరిపోతున్న ఖైదీ టీమ్...? హీరోగా ఓకే.. నిర్మాతగా పిసినారట!

గురువారం, 1 డిశెంబరు 2016 (11:51 IST)

Widgets Magazine
ram charan in dhruva

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. దేశవ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాల్లో సైతం కష్టాలు కూడా ఈ సినిమా వ్యాపారానికి ఎలాంటి ప్రతిబంధకం కాకపోవడం టాలీవుడ్ బిజినెస్ వర్గాలకు షాక్ ఇస్తోంది. ఇన్ని వ్యతిరేక పరిస్థితులలో కూడా ఈ సినిమా అనుకున్న స్థాయిలో బిజినెస్ చేయడమేకాకుండా రూ.20 కోట్ల వరకు విడుదల కాకుండానే టేబుల్ ప్రాఫిట్ దక్కించుకుంది అన్న వార్తలు వస్తున్నాయి.
 
దీనితో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టి మొట్టమొదటి సినిమాతోనే భారీ లాభాలు కొట్టేశాడు అంటూ చరణ్‌పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే చరణ్‌కు ఈ సినిమాపరంగా మంచి లాభాలు వచ్చినా ఈ సినిమాలో నటించిన చాలామంది నటీనటులకు కనీసం వారి స్థాయిలో వచ్చే పారితోషికాలు కూడ 'ఖైదీ నెంబర్ 150' నటించినందుకు రాలేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
దీనితో చరణ్ నిర్మాతగా చాల పొదుపుగా వ్యవహరిస్తున్నాడు అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమా మేకింగ్ విషయంలో చరణ్ ఎటువంటి రాజీ పడకపోయినా ఈ సినిమాలోని నటీనటులకు సాంకేతిక నిపుణులకు పారితోషికం ఇచ్చే విషయంలో చరణ్ గీచిగీచి బేరాలు ఆడుతున్నారని ఫిలింనగర్‌లో గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి.
 
అంతేకాదు చిరంజీవి 150వ సినిమాలో అవకాశం వచ్చి నటించడమే గొప్ప అన్న ఫీలింగ్ ఈ సినిమాకు పనిచేసిన అందరికీ కలిగించడంలో చరణ్ అద్భుతమైన చాతుర్యం ప్రదర్శించాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనితో ఈసినిమాకు పనిచేసిన చాలామంది యూనిట్ మెంబర్లకు మెగా కాంపౌండ్ ఎంత ఇస్తే అంతటితో సంతృప్తి పడవలసిన పరిస్థితి ఏర్పడింది అన్న కామెంట్స్ హడావిడి చేస్తున్నాయి.
 
ఫిల్మ్ నగర్‌లో వినపడుతున్న వార్తల ప్రకారం చరణ్ ఈ పారితోషిక వ్యవహారాలను ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చరణ్ సన్నిహితులు ఇద్దరు నిర్వహిస్తున్నట్లు టాక్. దీనితో ఈ సినిమాలో నటించిన చాలామంది అసలు విషయాలను చరణ్ దృష్టికి తీసుకు వెళ్ళలేక మధన పడుతున్నాయి. ఏది ఏమైనా చరణ్ నిర్మాతగా తొలి సినిమాతోనే చాల అనుభవశాలిగా మారిపోయాడు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను రెండు సార్లు అత్యాచారానికి గురయ్యా... అమెరికా నటి ఇవాన్ రేచల్

సెలెబ్రెటీలు తమ వ్యక్తిగత జీవితంలో జరిగే కొన్ని విషయాలను బహిర్గతం చేసేందుకు పెద్దగా ...

news

బాబీలోనా మంత్రగాడి చేతిలో చిక్కుకుందా? గత ఏడాదే పెళ్లైపోయిందట.. మరి కేసు?

శృంగారతార బాబీలోనా నానమ్మ కృష్ణకుమారి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మంత్రగాడి చేతిలో తన ...

news

కోచ్చడయాన్ నష్టాలు: లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టు నోటీసులు..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ...

news

బన్నీ రికార్డును బ్రేక్ చేసిన రష్మీ.. నీ సొంతం పాటతో యూట్యూబ్‌లో 2కోట్ల 3లక్షల వ్యూస్..

బన్నీ రికార్డ్‌ని రష్మీ తన హాట్ అందాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గతంలో యూట్యూబ్‌లో ...