శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (16:12 IST)

బాలకృష్ణ 101 చిత్రం.. కృష్ణవంశీకి ఛాన్స్.. ముమ్మరంగా చర్చలు

ప్రస్తుతం బాలయ్య 100 వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో బిజీ బీజీగా ఉన్నాడు. ఈ సినిమా పట్టాలెక్కకముందే త‌ర్వాతి సినిమాలు చేయడానికి బాల‌కృష్ణ స్పీడు స్పీడుగా రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. 'గౌత‌మీపుత్ర

ప్రస్తుతం బాలయ్య 100 వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో బిజీ బీజీగా ఉన్నాడు. ఈ సినిమా పట్టాలెక్కకముందే త‌ర్వాతి సినిమాలు చేయడానికి బాల‌కృష్ణ స్పీడు స్పీడుగా రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతికి విడుద‌ల చేయాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడు. 
 
ఆ వెంట‌నే 101వ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించడానికి బాలకృష్ణ ప్రణాళికులు సిద్ధం చేస్తున్నార‌ట‌. ఆ సినిమా దాదాపుగా కృష్ణ‌వంశీతోనే ఉంటుందని టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. బాల‌కృష్ణ - కృష్ణ‌వంశీల క‌ల‌యిక‌లో వందో చిత్రంగా ''రైతురాజ్యం'' అనే సినిమా తెర‌కెక్కుతుంద‌ని కొద్దిరోజుల క్రింద‌ట ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే కృష్ణ‌వంశీ స్థానంలో అనుకోకుండా క్రిష్ వ‌చ్చాడు. ఆ సినిమా కూడా ప‌ట్టాలెక్కింది. 
 
ఈ సినిమా పూర్తైన అనంతరం బాల‌య్య 101, 102 సినిమాల‌ు తెరకెక్కనుంది. శాత‌క‌ర్ణి త‌ర్వాత బాల‌య్య 101వ సినిమాగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టిస్తాడ‌ని తెలుస్తోంది. కృష్ణ‌వంశీతో తాను అనుకొన్న ప్రాజెక్టుని ఎట్టిప‌రిస్థితుల్లోనూ పూర్తి చేస్తానంటున్నాడ‌ట బాల‌య్య‌. రైతు క‌థ బాల‌య్య‌కు విపరీతంగా నచ్చడంతో... కృష్ణ‌వంశీతో రైతు క‌థ‌ని 101వ సినిమాగా బాల‌య్య తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది. అంటే రెండేళ్ల వ‌ర‌కూ బాల‌య్య బిజీ బిజీ అన్నమాట‌.