Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దర్శకుడు మణిరత్నం ఇంటిముందే ఆత్మహత్య చేసుకుంటానంటున్న లైట్‌మెన్

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (17:21 IST)

Widgets Magazine

భారతీయ చిత్రపరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకదిగ్గజం మణిరత్నం. ఈయన ఇంటి ముందు ఆత్మహత్య చేసుకోనున్నట్టు ఓ లైట్‌మెన్ ప్రకటించారు. ఈ ప్రకటన సంచలనం రేపుతోంది. ఓ లైట్‌మెన్ ఈ తరహా ప్రకటన చేయడానికి గల కారణాలను పరిశీలిస్తే... 
 
గతంలో మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లతో ‘గురు’ సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మణిమారన్‌ అనే లైట్‌మెన్‌కు ప్రాణాంతకమైన రక్తసంబంధిత వ్యాధి వచ్చిందట. దీంతో వైద్య ఖర్చుల కోసం చిత్ర యూనిట్ సాయం కోరాడు. 
 
అయితే చిత్ర యూనిట్ నుంచి అతడికి ఎలాంటి సాయం లభించలేదట. దీంతో మణిమారన్ సాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాడట. అతడికి అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు.. రూ.2 లక్షల పరిహారం చెల్లించాలంటూ ఆదేశించిందని కోలీవుడ్ మీడియా చెబుతోంది.
 
కోర్టు తీర్పునిచ్చినా మణిరత్నంగానీ, లైట్‌మెన్ యూనియన్‌గానీ పట్టించుకోలేదు. పదేళ్ల నుంచి వైద్య ఖర్చులు భరిస్తున్నామని, ఇక ఆ స్థోమత తమకు లేదని, మణిరత్నం ఖచ్చితంగా సాయం చేయాలని, లేకపోతే మణిరత్నం ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, ఆత్మహత్యకూ వెనకాడబోనని హెచ్చరించాడు. ప్రస్తుతం ఇది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గూగుల్‌కే షాకిచ్చిన సెక్స్ బాంబ్ పూనమ్ పాండే... నా యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని వీక్షించండి!

బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు తేరుకోలేని షాకిచ్చారు. ...

news

చైతూ - సమంత పెళ్లి ఫిక్స్... మామ నాగార్జునతో అది పూర్తికాగానే వివాహం

టాలీవుడ్ ప్రేమజంట హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల పెళ్లి ఫిక్స్ అయింది. అక్టోబరు నెలలో ...

news

ప్రభుదేవా ఇపుడు తమన్నాను పట్టేశాడట... అలా జరిగిపోతోందంటూ...

కోలీవుడ్ పాపులర్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గురించి, ఆయనపై వచ్చిన రూమర్లు గురించి వేరే ...

news

మన రేంజ్‌కు కాజల్ - రకుల్ సరిపోరు.. సమంత అయితే సమ్మగా ఉంటుంది.. అలీ కామెంట్స్

టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు తన నోటిదూల ప్రదర్శించాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రంలో ...

Widgets Magazine