గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (11:56 IST)

"ఆగడు"కు రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ స్టేజ్ లాభాలు!

మహేష్ బాబు, తమన్నా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "ఆగడు". ఈ చిత్రం ఈ వారంలో విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందే లాభాలను అర్జిస్తోంది. టాలీవుడ్ ట్రేడ్ లెక్కలను బట్టి చూస్తే, మొత్తానికి ఈ సినిమా 10 కోట్ల లాభాలను ప్రీ రిలీజ్ స్టేజ్ లోనే పొందింది. ఇటీవలి కాలంలో ఇదొక రికార్డుగానే చెప్పుకోవచ్చు! 
 
వాస్తవానికి 'ఆగడు' సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. బిజినెస్ వర్గాలలో అయితే ఈ సినిమా పట్ల చాలా అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ నటించిన గత చిత్రం '1' బాక్సాఫీసు వద్ద దారుణంగా దెబ్బతిన్నప్పటికీ ఆ ప్రభావం దీనిపై ఇసుమంతైనా పడకపోవడం విశేషం. 
 
దానికి ప్రధాన కారణం, ఇది 'దూకుడు' కాంబినేషన్ కావడమే! దర్శకుడు శ్రీను వైట్ల సినిమా అంటే ఎంటర్‌టైన్మెంట్ గ్యారెంటీ అనే ట్యాగ్ ఒకటుంది. దానికి తోడు, అలాంటి కథలను మహేష్ బాబు ఇరగదీస్తాడు. సునాయాసంగా మోసేస్తాడు కూడా. ఈ కారణాల మూలంగానే ఈ సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ జరుపుకుని లాభాలు మూటగట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రం పబ్లిసిటీ కోసం ఆగడు సూపర్ స్టార్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.