శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (10:41 IST)

అర్జున్ కపూర్ మంచి స్నేహితుడే.. ప్రజలు అపార్థం చేసుకున్నారు: మలైకా అరోరా

గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక అంటూ ఐటమ్ సాంగ్‌తో అలరించిన మలైకా అరోరా వివాహ జీవితం ఇబ్బందుల్లో ఉంది. యువహీరో అర్జున్‌ కపూర్‌తో మలైకాకు ఎఫైర్‌ ఉండటం వల్లే ఆమె వైవాహిక బంధం బీటలు వారిందని జోరుగా ప్రచారం సా

గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక అంటూ ఐటమ్ సాంగ్‌తో అలరించిన మలైకా అరోరా వివాహ జీవితం ఇబ్బందుల్లో ఉంది. యువహీరో అర్జున్‌ కపూర్‌తో మలైకాకు ఎఫైర్‌ ఉండటం వల్లే ఆమె వైవాహిక బంధం బీటలు వారిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మలైకా, అర్బాజ్‌ఖాన్‌ దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అర్జున్‌ కపూర్‌తో మలైకా సన్నిహితంగా ఉండటం నచ్చకపోవడం వల్లే ఆమె నుంచి విడిపోవాలని అర్బాజ్‌ భావిస్తున్నాడట. 
 
అర్జున్‌ కపూర్‌ విషయమై తొలిసారి మలైకా అరోరా స్పందించారు. 'అర్జున్‌ నాకు చాలామంచి స్నేహితుడు. కానీ ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు. అది నిజం కాదు' అని మీడియాకు చెప్పారు. మొత్తానికి మలైకా, అర్బాజ్‌ దంపతులు కోర్టులో విడాకులకు దాఖలుచేసినా వారికి ఇంకా ఆరు నెలల సమయముంది. ఈలోపు మళ్లీ ఈ దంపతులు కలిసిపోతే బాగుండు అని శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఇటు మలైకా, అటు అర్బాజ్‌ వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం వల్లే వారి మధ్య ఈ బ్రేకప్‌కు కారణమైందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.