Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎట్టకేలకు కుదిరిన డీల్... మణిరత్నం చిత్రంలో రామ్‌చరణ్

హైదరాబాద్, మంగళవారం, 11 జులై 2017 (03:56 IST)

Widgets Magazine

సంవత్సర కాలంగా ఊరిస్తున్న వార్త ఇప్పటికి సాకారమయింది. దక్షిణ భారత చిత్రపరిశ్రమలో ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నూతన చిత్రానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. కాట్రువెలియిడై చిత్రం తరువాత ఆ దర్శకుడు తదుపరి చిత్ర పనుల్లో మునిగిపోయారు. ఈ సారి భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. టాలీవుడ్‌ యువ కథానాయకుడు రామ్‌చరణ్, మాలీవుడ్‌ నటుడు ఫాహద్‌ పాజిల్‌ల కాంబినేషన్‌లో తమిళం, తెలుగు భాషల్లో చిత్రం చేయబోతున్నట్లు తాజా సమాచారం. రామ్‌చరణ్‌ ప్రస్తుతం రగస్థలం అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 
 
మణిరత్నం తీస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారని, అందులో ఒకరుగా కాట్రువెలియిడై చిత్రం ఫేమ్‌ అదిథిరావు నటించనున్నారని వినికిడి. మరో కథానాయకి ఎంపిక కూడా జరుగుతున్నట్లు తెలిసింది. కాగా మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్‌.రెహ్మాన్‌ బాణీలు కట్టనున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంతోష్‌శివన్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఇంతకుముందు మణిరత్నం చిత్రాలు దళపతి, రోజా, ఇరువర్, ఉయిరే, రావణన్‌ చిత్రాలకు సంతోష్‌శివన్‌ చాయాగ్రహణం అందించారన్నది గమనార్హం. కాగా 
 
ఈ క్రేజీ చిత్రం సెప్టెంబర్‌లో సెట్‌ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. గత సంవత్సరం మణిరత్నం, సుహాసిని దంపతులు మెగాస్టార్ చిరంజీవిని కలిసి రామ్‌చరణ్‌తో సినిమాకు దర్శకత్వం వహించడంపై చర్చించడం. అప్పట్లో కథ విన్న తర్వాత కూడా మార్పులు చేయాలని చెప్పడంతో కాస్త వాయిదా పడటం తెలిసిందే.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి అవంతికను వరించే వరుడెవరో?

బాహుబలి అవంతిక త్వరలో పెళ్లి కూతురు కాబోతుందట. ఇటీవలే తన సోదరుడి వివాహ నిశ్చితార్థ ...

news

చైతూతో ఇప్పటికే నాకు పెళ్లైపోయింది.. తెలుసా? సమంత ట్వీట్

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్యల వివాహం అక్టోబరులో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ ...

news

లిబియా నియంత గడాఫీతో ఫోజిచ్చిన కత్రినా కైఫ్... నెట్‌లో ఫోటో వైరల్

మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించి.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను ...

news

అలా ప్రకటించారనీ 'దువ్వాడ జగన్నాథమ్' ఆఫీసుపై దాడి

మెగా అభిమానులు మరోమారు రెచ్చిపోయారు. అల్లు అర్జున్ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని డీజే ...

Widgets Magazine