Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సమంతకు ప్రతీరోజూ శృంగారం ఉండాలట.. పెళ్లయ్యాక ఇంట్లోనే కూర్చోమంటారా?

శుక్రవారం, 14 జులై 2017 (11:17 IST)

Widgets Magazine

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గాలి.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు సోకినట్లుంది. కాగా, గతంలో రాంగోపాల్ వర్మ్ కూడా తనకు మూడుపూటలా శృంగారం ఉండాల్సిందేనని చెప్పిన సంగతి తెలిసిందే. తనకు ప్రతీరోజూ శృంగారం ఉండాల్సిందేనని సమంత చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

జస్ట్ ఫర్ విమన్ మేగజీన్‌కు ఫోటో షాట్ చేసిన సందర్భంగా చేసిన చిట్ చాట్‌లో సమంత వర్మలా మాట్లాడింది. ప్రతిరోజూ శృంగారం ఉండాలని తెలిపింది. ఆకలి ఎలాగో శృంగారం కూడా అలాగేనని చెప్పింది. ప్రతి ఒక్కరికీ ఇది సర్వసాధారణమేనని చెప్పింది. ఈ వ్యాఖ్యలు విని సినిమాల్లో సమంతకు, నిజజీవితంలో సమంతకు అస్సలు పోలిక లేవనిపించేలా ఉన్నాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 
 
అలాగే సమంత సమయాన్ని వృధా చేయనంటోంది. ఖాళీగా ఉండటం ఇష్టముండదని.. టైమ్ దొరికితే సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు షాపింగ్ చేస్తానని చెప్పింది. అలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ద్వారా వచ్చే ఎమౌంట్‌లో మాత్రం తాను పైసా తీసుకోనని చెబుతోంది. ఆ డబ్బంతా 'ప్రత్యూష ఫౌండేషన్' కి అందజేస్తానని అంటోంది. అలాగే తన పారితోషికంతో కొంత ఆ ఫౌండేషన్‌కి కేటాయిస్తానని వెల్లడించింది. పెళ్లైన తర్వాత తప్పకుండా సినిమాల్లో కనిపిస్తానని స్పష్టం చేసింది. ఇదే ప్రశ్నకు విలేకరులు మళ్లీ మళ్లీ అడగడంతో కొంత అసహనానికి గురైంది. 
 
ఇదే ప్రశ్నను ఏ వైద్యుడినో, ఇంజినీరునో, ఉపాధ్యాయురాలినో వేస్తారా? వారు పెళ్లి చేసుకున్న త‌ర్వాత కూడా అదే వృత్తిలో ఉంటారు క‌దా? అదేవిధంగానే తాను కూడా పెళ్ళైనా కెరీర్‌ను కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఇంట్లోనే కూర్చుని మగ్గిపొమ్మంటారా? అని ఘాటుగా ప్ర‌శ్నించింది. ప్ర‌స్తుతం స‌మంత తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టిస్తూ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Media Doubts Samantha Angry Chaitanya Romance Marriage Ram Gopal Varma

Loading comments ...

తెలుగు సినిమా

news

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్: రవితేజ, నవదీప్, ఛార్మీ, ముమైత్, పూరీలకు ఎక్సైజ్ నోటీసులు?

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్‌ జోగుతుంది. ఆ మత్తును వదిలించేందుకు హైదరాబాదు పోలీసులు కార్యాచరణ ...

news

ఆ నటి పేరును దాచిపెట్టకండి.. పేరును పేర్కొనడంలో తప్పేమీ లేదు: కమల్

మలయాళ నటి భావన కిడ్నాప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు ...

news

దిలీప్ అరెస్టుతో అందరిలాగానే నేను కూడా షాకయ్యా.. నేరం చేస్తే శిక్ష తప్పదు: భావన

కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ స్టార్ హీరో దిలీప్‌ అరెస్టుతో అందరిలాగానే తాను ...

news

నిద్రపట్టక వరుణ్‌కి, అమ్మకి చెప్పే మాత్రలు మింగాను.. ఆత్మహత్య అంటారా. వాపోయిన వితిక

నిద్రపట్టకపోతే స్లీపింగ్‌ టాబ్లెట్స్‌ తీసుకున్నా. ఆ టాబ్లెట్స్‌ వల్ల ఓ పదీ పన్నెండు గంటలు ...

Widgets Magazine